రోబో సీక్వెల్ కోసం పార్లమెంట్, ఎర్రకోట సెట్స్!! | Director Shankar leaked new still of 2.0

Director shankar leaked new still of 2 0

Director Shankar leaked new still of 2.0, new still of 2.0 and shooting, Shankar leaked new still of 2.0

Director Shankar leaked new still of 2.0 and shooting progress.

రజనీ రోబో 2.0 కాస్త 2/3గా మారితే...

Posted: 10/05/2016 02:41 PM IST
Director shankar leaked new still of 2 0

సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ సినిమా రోబో సీక్వెల్ పరిస్థితి ఏంటి? ఇప్పటిదాకా రిలీజైన ఫోటోలన్నింటిని ఫేక్ అని చెబుతున్న శంకర్ ఎక్కడిదాకా వచ్చాడు. అసలు సినిమా ప్రోగ్రెస్ ఏంటీ అన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేస్తున్నాడు ఈ ఇండియన్ స్పీల్ బర్గ్. సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉన్న శంకర్ తన ట్విట్టర్ లో అందుకు సంబంధించి విషయాలను తెలియజేశాడు.

2.0 2/3 150 అని రజనీతో దిగిన ఓ స్టిల్ ను పెట్టి అనుమానాలను పటాఫంచల్ చేసేశాడు. అంతే 150 రోజులుగా నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న రోబో సీక్వెల్ దాదాపు ముప్పాతిక వంతు షూటింగ్ అయిపోయిందనే చెప్పేశాడు. అంతేకాదు ప్రత్యేక సెట్లో అల్రెడీ క్లైమాక్స్ పార్ట్ ఎప్పుడో షూట్ చేసిన శంకర్, ఎర్రకోట, పార్లమెంట్ సెట్ లను చెన్నైలోనే వేయించి కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేయబోతున్నాడు.

ఇంకోపక్క అమెరికాలో నాలుగు నెలలపాటు ట్రీట్ మెంట్ చేయించుకుని వచ్చిన రజనీ ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడని స్టిల్ చూస్తే అర్థం అవుతోంది. ఇండియాలో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న రోబో2.0 లో సూపర్ స్టార్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంటే... బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ రోల్ లో మెరవనున్నాడు. చిత్ర షూటింగ్ త్వరగతిన పూర్తయినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఆరు నెలలకు పైగా సమయం తీసుకుంటాడంట దర్శకుడు శంకర్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajanikanth  Robo Sequel  Robo 2.0  Shankar  Twitter  Shooting stills  

Other Articles

Today on Telugu Wishesh