ఈసారి రాధికా ఆప్టేను వదిలిపెడతారా? | Radhika Apte response on Pakistani Actor's Ban

Radhika apte says pakistani actors shouldn t be banned

Radhika Apte supports Salman Statement, Pakistani actors shouldn’t be banned, Radhika Apte about Pakistani Actors

Radhika Apte supports Salman Statement, syas Pakistani actors shouldn’t be banned.

వివాదాస్పద అంశంపై స్పందించిన నటి

Posted: 10/05/2016 10:39 AM IST
Radhika apte says pakistani actors shouldn t be banned

న్యూడ్ సీన్లతో వివాదాలు, ఆపై ఫ్రీ పబ్లిసిటీ కొట్టేసి ఎప్పుడూ నోళ్లలో నానుతున్న నటి రాధికా ఆప్టే ఇప్పుడు దేశం మొత్తం కుదిపేస్తున్న అంశంపై స్పందించింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పాక్ నటులు ఇండియాకు తిరిగి రావాలంటూ తీవ్ర దుమారం రేపి నేతల నుంచి కూడా చివాట్లు తిన్నాడు సల్మాన్ ఖాన్. ఆపై మహేష్ భట్, కరణ్ జోహార్ లాంటి సినీ ప్రముఖులు కూడా ఆ వ్యాఖ్యలకు మద్ధతు ఇచ్చి వ్యవహారం మరింత ముదిరేలా చేశారు.

ఇక ఇప్పుడు రాధికా ఆప్టే ఈ విషయంలో దాదాపు అలాంటి కామెంట్లే చేసింది. ఓ వాచీ సంస్థ లాంఛింగ్ ప్రారంభంలో పాల్గొన్న రాధిక మాట్లాడుతూ... పాకిస్థానీ నటులపై నిషేధం విధించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. తీవ్రవాదాన్ని ముమ్మాటికి తప్పు, దాడులను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ, అందుకోసం కళాకారులను కష్టపెట్టడం సరికాదు అంటూ పేర్కొంది.

 స్విట్జర్లాండ్‌లో తయారైన ఓ వాచ్‌.. భారత్‌లో వారి సొంత షాపుల్లోనే అమ్ముతున్నప్పుడు, పాక్‌ నటులు ఇక్కడ నటించడం తప్పులేదని రాధిక చెబుతోంది. సరైన వీసాతో ఇండియాకు వచ్చి ఇక్కడి సినిమాల్లో నిరభ్యరంతంగా నటించోచ్చని సల్మాన్ చెబితే.. పుణ్యభూమి నా దేశం అంటూ నానాపటేకర్ సల్మాన్ వ్యాఖ్యలను తప్పుపట్టడం తెలిసిందే. ఇక మరో సీనియర్ నటుడు ఓంపురి అయితే ఏకంగా ఆర్మీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  Pakistan Artisits  Ban  No Need  

Other Articles