రజనీ అడ్డాలో అతనికి అంత సీన్ ఉందా? | Sivakarthikeyan Remo Huge screens in Japan

Sivakarthikeyan remo huge screens in japan

Rajanikanth Sivakarthikeyan, Remo more screens in Japan, Rajani Adda for sivakarthikeyan, remo screening in Japan, Sicakarthikeyan Remo Record

రజనీ అడ్డాలో అతనికి అంత సీన్ ఉందా? | Sivakarthikeyan Remo Huge screens in Japan

ఆ చిన్న హీరో రజనీని మించిపోతున్నాడా?

Posted: 10/04/2016 06:05 PM IST
Sivakarthikeyan remo huge screens in japan

టీవీ యాంకర్ నుంచి తమిళ హీరోగా ప్రమోట్ అయిన శివకార్తీకేయన్ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. విజయ టీవీలో యాంకర్ గా ఉన్న అతనికి లైఫ్ ఇచ్చింది మాత్రం హీరో ధనుష్ అనే చెప్పాలి. 3 సినిమాతో ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వగా, మెల్లిగా తన టాలెంట్ తో హీరోగా ఎదిగాడు. రీసెంట్ గా వచ్చిన రజనీ మురుగన్ సినిమా యాభై కోట్లు వసూలు చేయటం ఒకరకంగా రికార్డు అనే చెప్పాలి.

ప్రస్తుతం స్టార్ హీరో లిస్ట్ కి చేరిపోయిన శివకార్తీకేయన్ తో జోడీ కట్టేందుకు అగ్రహీరోయిన్లు సైతం ఎగబడి పోతున్నారు. ఆ మధ్య సమంతతో ఓ ప్రాజెక్టు అనుకున్నప్పటికీ, అది కుదరకపోగా, లక్కీ లేడీ నయనతార ఆ లోటును భర్తీ చేసింది. ఇక ఇప్పుడు శివకార్తీకేయన్ అప్ కమింగ్ సినిమా రెమోపై అంచనాలు అమాంతం పెరిగాయి. ప్రముఖ టెక్నీషియన్స్ పని చేస్తున్నఈ సినిమాను అంతే స్థాయిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్ర నిర్మాతలు.

తమిళనాటే కాదు... విదేశాల్లో కూడా అతగాడికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సాధారణంగా తమిళ సినిమాలను, ముఖ్యంగా జపాన్ లో పెద్ద ఎత్తున్న రిలీజ్ చేస్తుంటారు. రాజధాని టోక్యోతోపాటు యోకోమో లాంటి నగరాల్లో ఎక్కువ స్క్రీన్లలో కోలీవుడ్ సినిమాలు సందడి చేస్తుంటాయి. కానీ, ఒక్క నాగోయ పట్టణంలో మాత్రం రజనీకాంత్ అడ్డాగా చెప్పుకుంటారు. అయితే రెమో సినిమాను అక్కడ కూడా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 7న గ్రాండ్ గా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sivakarthikeyan  Remo Movie  Japan  Huge Screens  

Other Articles