విలన్ గా సునీల్... తెలుగులో కాదంట! | sunil intersted in Villian roles

Sunil intersted in villian roles

Actor sunil intersted in Villian roles, Sunil turns Villian, Sunil desire, sunil turns villian for, Hero Sunil become villian for, Edu Goldehe Sunil Interview, Sunil in another language movie

Actor sunil intersted in Villian roles.

సునీల్ అలా అయితే చాలా కష్టం

Posted: 10/04/2016 05:34 PM IST
Sunil intersted in villian roles

సునీల్ కెరీర్ కి ఇప్పుడు హిట్ చాలా అవసరం. కామెడీ ఫ్లస్ థ్రిల్లర్ గా రాబోతున్న  ఈడు గోల్డెహే పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.  ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా సినిమా గురించే కాదు... బోలెడు విషయాలు చెబుతున్నాడు. తానసలు హీరోగా కానీ, కమెడియన్ గా గానీ అనుకుని రాలేదని అంటున్నాడు.

నిజానికి ఇండస్ట్రీకి నేను విలన్ అవుదామని వచ్చాను. కానీ, విచిత్రంగా కమెడియన్ గా మారిపోయాను. హీరోగా మారిన తర్వాత కూడా సీరియస్ కంటే తాను చేసే కామెడీ వేషాలకే అభిమానులు ఆదరణ చూపిస్తున్నారు. కానీ, ఎప్పటికైనా విలన్ వేషం వేసి తీరటమే తన కోరిక అంటూ చెబుతున్నాడు పూలరంగడు. అయితే తెలుగులో ఇది సాధ్యం కాకపోయినా వేరే భాషల్లో అయినా చేసి తీరతానంటున్నాడు.

ఇక ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని సునీల్, త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలను, వచ్చే ఏడాది ఆ చిత్రం ఉండొచ్చన్న సంకేతాలు అందించాడు. విలన్ వేషాలేమో గానీ, ముందు 7న విడుదలయ్యే ఈడు గోల్డెహే చిత్రం మాత్రం హిట్ అయ్యి సునీల్ ఫామ్ లోకి రావాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Sunil  Villian  Edu Goldehe Interview  

Other Articles