తమ్ముళ్ల పంచాయితీని తీర్చిన కాటమరాయుడు | Brothers Of Katamarayudu Confirmed

Katamarayudu s brothers confirmed

Ajay, Kamal Kamaraju and siva Balaji, Pawan Brothers Confirmed, Katamarayudu Brothers, Brothers Of Katamarayudu Confirmed

Ajay, Kamal Kamaraju and siva Balaji Confirmed for Katamarayudu Brothers.

కొత్త సమస్యనూ తీర్చేశాడు

Posted: 09/30/2016 12:21 PM IST
Katamarayudu s brothers confirmed

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు అన్ని అవాంతరాలు దాటుకుని షూటింగ్ జరుగుతున్న సమయంలో కొత్త చిక్కు వచ్చిపడింది. అజిత్ వీరమ్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో కథానుసారం పవన్ కి తమ్ముళ్లు ఉండాలి. అందుకోసం చిత్ర యూనిట్ తెగ అన్వేషణ చేసి నటులను సెలక్ట్ చేసింది. ఆ విషయంలో చిత్ర యూనిట్ అనుకొని ట్విస్టులు ఎదురుకాగా, వాటిని పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది.

ముందుగా కమల్ కామరాజు, పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండను ఇద్దరు తమ్ముళ్లుగా సెలక్ట్ చేసి, అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. కానీ, చివరి నిమిషంలో డేట్స్ కారణంతో విజయ్ హ్యాండివ్వటంతో మళ్లీ మొదటికొచ్చింది. దీంతో తమ్ముళ్ల పంచాయితీ మళ్లీ మొదటికే వచ్చినట్లయ్యింది. ఫైనల్గా ఈ ముగ్గురు తమ్ముళ్ల పాత్రలకు నటీ నటుల ఎంపిక పూర్తయ్యింది.
 
కామల్ కామరాజుతోపాటు, అజయ్, శివబాలజీలు మిగతా ఇద్దరిగా నటించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గానే అనౌన్స్ చేసేయటమే కాదు త్వరలో సెట్స్ లో జాయిన్ అవుతారని చెప్పేసింది కూడా. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి డాలీ డైరక్టర్ కాగా శృతీ హాసన్ హీరోయిన్. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katamarayudu  Pawan Kalyan  brothers  Confirmed  

Other Articles

Today on Telugu Wishesh