ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపై షాకింగ్ డెసిషన్ | NTR Adhurs 2 sequel in vinayak Direction

Ntr adhurs 2 sequel in vinayak direction

NTR next may Adhurs sequel, Adhurs sequel, NTR Adhurs 2, NTR shocks with Adhurs 2, Adhurs 2 on floor, NTR next After Janatha Garage, Vinayak about Adhurs 2, NTR about Adhurs 2, Vinayak NTR, Vinayak after Chiru 150

NTR next may Adhurs sequel under vinayak Direction

ఎన్టీఆర్ అదుర్స్ 2 అఫీషియల్ గానే...

Posted: 09/27/2016 10:29 AM IST
Ntr adhurs 2 sequel in vinayak direction

‘జ‌న‌తా గ్యారేజ్’ విజ‌యంతో మంచి జోరు మీదున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న తరువాతి ప్రాజెక్టుపై చాలా జాగ్ర‌త్త వ‌హిస్తున్నాడు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాల విష‌యంలో ఇప్ప‌టికే చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు విన‌ప‌డుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు ఈ జాబితాలో లింగుస్వామి-త్రివిక్ర‌మ్‌-వ‌క్కంతం వంశీ-పూరి జ‌గ‌న్నాథ్ ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే వీరిలో ఎవరితో సినిమా తీసినప్పటకీ, ఎప్పటినుంచో అనుకుంటున్న ఓ ప్రాజెక్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టాలెక్కించేందుకు ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.

గ‌తంలో తాను హీరోగా న‌టించి హిట్ అయిన ఓ హిట్ సినిమా సీక్వెల్‌లో న‌టించేందుకు ఎన్టీఆర్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. అదుర్స్ 2... ఎలాగైనా తెరకెక్కించి తీరతానని ఇది వరకే దర్శకుడు వివి వినాయక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో దానికి ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. గ‌తంలో వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆది బ్లాక్ బస్టర్ గా నిలవగా, సాంబ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక మూడో చిత్రంగా వచ్చిన ‘అదుర్స్’ కామెడీతో కితకితలు పెట్టింది‌.

ఈ మధ్య బన్నీ దువ్వాడ జగన్నాథం సినిమా సబ్జెక్ట్ కాస్త అటు ఇటుగా ఇదేననీ, దీనిని అదుర్స్ సీక్వెల్ అంటూ గాసిప్స్ వినిపించినప్పటికీ, అదంతా ఉత్తదేనని తేలిపోయింది. కామెడీ అండ్ మాస్ ఎంటర్‌టైన‌ర్ అదుర్స్‌కి సీక్వెల్‌గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే కామెడీ ద్వయం కోన వెంకట్, గోపీ మోహన్ స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దుతున్నారు. వినాయ‌క్ ప్ర‌స్తుతం చిరు 150వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అది పూర్తవ్వగానే అఫీషియల్ అనౌన్స్ మెంట్ తోపాటు, షూటింగ్ ను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vinayak  NTR  Adhurs 2  

Other Articles