మర్యాదరామన్న తర్వాత మరో సినిమానా? | Sunil Confidence on Edu Goldehe Movie

Sunil fears about acting and dance

Sunil Confidence on Edu Goldehe Movie, Edu Goldehe Movie Interview, sunil fears about acting and dance, Sunil Edu Goldehe Movie Interview, Special elements in Edu Goldehe Movie, Edu Goldehe Trailer Talk

Sunil Confidence on Edu Goldehe Movie Success.

సునీల్ రెండు భయాల గురించి...

Posted: 09/26/2016 06:14 PM IST
Sunil fears about acting and dance

ఈ మధ్య ఒకే రకం సినిమాలతో విసిగిస్తున్నాడంటూ ఫిర్యాదులు రావటమే కాదు, ఏకంగా సునీల్ సినిమాలను తిప్పికొడుతున్నారు ప్రేక్షకులు. రోటీన్ కంటెంట్ తో వరుసగా వచ్చిన సినిమాలు వచ్చినట్లే పోతున్నాయి. అందుకే ఈసారి కామెడీకి కాస్త ట్విస్ట్ ను టచ్ అప్ చేసి పలకరిస్తున్నాడంట. అదే ఈడు గోల్డెహె. లేటెస్ట్ గా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సునీల్ ఏమంటున్నాడో తెలుసా?

ఇప్పటివరకు ఎన్ని డ్యాన్స్ లు చేసినా, ఎన్ని సినిమాల్లో డైలాగ్ లు చెప్పినా కూడా కొత్త సినిమా అనేసరికి ఆ రెండూ చేయాలంటే టెన్షన్.. భయంగానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ‘ముఖ్యంగా డ్యాన్స్ విషయానికొస్తే, పక్కనే ఉండి డ్యాన్స్ అసిస్టెంట్లు, వేరేవాళ్లు చింపేస్తుంటారు. అలాంటప్పుడు వాళ్లు చేసిన తర్వాత మనం చేయలేకపోతే..అనే టెన్షన్ పట్టుకుంటుంది’ అని అంటున్నాడు. ఇప్పటిదాకా తన కెరీర్ లో డిఫరెంట్ మూవీ అంటే ‘మర్యాద రామన్న’ అని, దానిలాగా ఇంకో డిఫరెంట్ సినిమా అంటే ‘ఈడు గోల్డ్ ఎహే’ అని తెలిపాడు. ఈ చిత్రంలో ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ వరకు కొత్త పాయింట్ తో పాటు ఫన్ ఉంటుందని, ముఖ్యంగా ‘కిడ్స్’ బాగా ఎంజాయ్ చేస్తారని సునీల్ పేర్కొన్నాడు.

ట్రైలర్ స్టార్టింగ్ నుంచి తన పాత్రను తనే నెరేట్ చేస్తున్న సునీల్ మనకు కనిపించడం, ఆ పాత్ర గురించి సునీల్ చెప్పేదానికి భిన్నంగా.. మూవీలో కేరక్టర్ బిహేవ్ చేస్తూ ఉంటుంది. అన్ని యాంగిల్స్ లోనూ కామెడీ పంచడానికి చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. ఓ థ్రిల్.. ఎంటర్టెయిన్మెంట్.. మాస్ ఎలిమెంట్స్.. క్లాస్ సీన్స్ అన్ని యాంగిల్స్ నీ మిక్స్ చేసినట్లు ట్రైలర్ లోనే కపిసిస్తోంది. ప్రామిసింగ్ గా ఉందనేంత రేంజ్ కనిపించకపోయినా... మళ్లీ కామెడీ టైమింగ్ లో పాత సునీల్ కనిపించడం మాత్రం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Edu Goldehe Movie  Inteview  

Other Articles