చైతూ కన్నా సమంతే చాలా బెటర్ | samantha finally breaks silence open up on Chaitu and Marriage

Samantha finally breaks silence on love and marriage

samantha confirms love with Chaitu, samantha finally breaks silence, samantha finally speaks about Naga Chaitanya and Marriage, samantha about Chaitanya, samantha about his lover, samantha marriage

samantha finally breaks silence open up on Chaitu and Marriage.

యస్... చై తో డేటింగ్ చేస్తున్నా: సమంత

Posted: 09/22/2016 10:24 AM IST
Samantha finally breaks silence on love and marriage

అక్కినేని ఇంటికి కాబోయే కోడలు నటి సమంత. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ పేరును నాగార్జున కాదు కదా, ప్రేమించిన నాగ చైతన్య కూడా చెప్పలేకపోయాడు. కానీ, సమంత మాత్రం ప్రియుడి పేరును తొలిసారిగా బయటపెట్టేసింది. "అవును 'చై'తో డేటింగ్ లో ఉన్నాను" అంటూ ప్రకటించింది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలనే చెప్పుకోచ్చింది శామ్.

ఇందులో దాచేందుకు ఏమీ లేదని కూడా అంది. తామిద్దరికీ కుటుంబ పెద్దల బ్లెస్సింగ్స్ ఉన్నాయని తెలిపింది. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నామన్న విషయం ఇంకా నిర్ణయించుకోలేదని, కుటుంబాలకు కూడా తమ వివాహ తేదీ మూడు నెలల ముందే చెబుతామని సమంత చెప్పింది. 'ఏం మాయ చేశావే' సినిమా నాటి నుంచి తామిద్దరం మంచి స్నేహితులమని సమంత తెలిపింది. ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఉందని, ఆ క్రమంలోనే డేటింగ్ చేస్తున్నామని చెప్పింది. ఇక, పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పుడు మీడియాతో ఎందుకు మాట్లాడాలంటూ వివరిచింది. అయితే, మీరనుకుంటున్నట్లు(మీడియాను ఉద్దేశించి) ఈ ఏడాది తాము వివాహం చేసుకోవడం లేదంటు స్పష్టం చేసింది.

పెళ్లి తర్వాత కెరీర్ కొనసాగింపు పై మాట్లాడుతూ... ఎనిమిదేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. సినిమాలు తప్ప నాకు ఇంకేమీ తెలీదు. పెళ్లంటే సినిమాల్లో నటించడం ఆపేయడమేనా? నేను సినిమాలను వదులుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం నేను చేస్తున్న పనిని ఎంకరేజ్ చేసే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాను. అటువంటి కుటుంబంలోకి వెళ్తున్నాను. పెళ్లి తర్వాత దర్శక-నిర్మాతలు, ప్రేక్షకులు ఎలా చూస్తారనేది వారిష్టం. వాళ్లు ఈమె మాకొద్దని చెప్పేవరకూ నటిస్తూనే ఉంటా. బాలీవుడ్‌లో జరుగుతున్నది ఇక్కడ కూడా జరగాలి అని వివరించింది.

చివరగా.. చైలో మీకు బాగా ఇష్టమైన అంశం ఏంటంటే చిన్నగా నవ్వుతూ... గందరగోళమైన నా జీవితాన్ని నిలకడ దారికి తీసుకొచ్చేది అతడే. నా నావకు అతను ఓ లంగరు లాంటి వాడు అంటూ ముగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Naga Chaitanya  Dating  Marriage  

Other Articles

Today on Telugu Wishesh