కొరటాల శివపై కోట షాకింగ్ కామెంట్లు | kota srinivas rao comments on Janatha Garage

Kota srinivas rao comments on janatha garage

kota srinivas rao comments on Janatha Garage, kota srinivas rao Janatha Garage, kota srinivas rao Koratala siva, Kota comments on Mohanlal, Kota on Janatha Garage, Kota comments on janatha garage, Kota comments on other languages artists

kota srinivas rao comments on Janatha Garage.

జనతా గ్యారేజ్ పై కోట మాట వింటున్నారా?

Posted: 09/16/2016 10:12 AM IST
Kota srinivas rao comments on janatha garage

డివైడ్ టాక్ తో మొదలైనప్పటికీ హీరో-దర్శకుడి కాంబో పై అంచనాలతో జనాలు థియేటర్లకు క్యూ కట్టడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కలెక్షన్ల సునామీతో దూసుకుపోతుంది. ఇక చిత్రంలో కథ విషయం పక్కనబెడితే లీడ్ రోల్స్ పోషించిన మోహన్ లాల్-ఎన్టీఆర్ కాంబో అదుర్స్ అన్నది మాత్రం ఒప్పుకోవాల్సిందే. పతాక సన్నివేశాల్లో ఎమోషన్ నటనతో ఈ ఇద్దరు కట్టిపడేశాడు. అయితే ఓవైపు సినిమాలో మోహన్ లాల్ నటన గురించి ప్రశంసలు కురిపిస్తున్న వేళ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గ్యారేజ్ దర్శకుడు కొరటాలపై కాస్త అసహనం ప్రదర్శించాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 'మొన్నీమధ్యన ఒక సినిమా రిలీజైంది. ఇంతవరకు హీరో గురించి ఎవరూ చెప్పడం వినలేదు. ఆ సినిమాలో మోహన్ లాల్ బాగా వేశాడు. అతను గ్రేట్ మలయాళం యాక్టర్. కాని అతన్ని పెట్టుకుని నువ్వు సినిమా చేసి.. బాగా చేశాడు అంటే ఎలా? మరి తెలుగువాడు ఏమైపోయాడు? అది చూపించాక తెలుగువాడు ఎంత యాక్ట్ చేస్తే నీకు ఆనతాడు?'' అంటూ ప్రశ్నించారు కోట. ''పనైపోతుంది కదా వాళ్ళని పెట్టుకుంటే.. మిగిలినవారు భోజనం చేయక్కర్లేదా??'' అంటూ ప్రశ్నించారు ఆయన.

కోట ఇలా మాట్లాడం కొత్తేం కాదు. పరభాష నటులను తెలుగులోకి తీసుకొచ్చి ఇక్కడి వారిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పదేళ్లపైగానే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి దిగుమతి అవుతున్న విలన్లపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. కేవలం బాడీ ఉంది కదా అనే తీసుకొస్తున్నారే తప్ప, నటనపరంగా వారు జీరో అంటూ ఓపెన్ గానే ఆయన చెప్పారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kota srinivas rao  comments  Janatha Garage  

Other Articles