మోహన్ బాబు కోసం ఏం మాట్లాడతాడు? | Chiru attend to Mohan Babu 40 years celebrations

Chiru attend to mohan babu 40 years celebrations

Megastar Chiranjeevi Mohan babu, megastar at Mohan Babu 40 years celebrations, Chiru speech at Mohan Babu 40 years celebrations, Chiru about mohan babu at Navarasa Nata Tilaka puraskar event, chiru for mohan babu, Mohan Babu and Chiranjeevi, Mohan Babu speech at 40 years celebrations, Megastar Mohan babu 40 yeras celebrations

Chiru attend to Mohan Babu 40 years celebrations

మోహన్ బాబు కోసం ఏం మాట్లాడతాడు?

Posted: 09/16/2016 03:51 PM IST
Chiru attend to mohan babu 40 years celebrations

తెలుగు వెండితెరపై ఆల్ మోస్ట్ ఒకేసారి కెరీర్ ప్రారంభించిన చిరు, మోహన్ బాబులు టామ్ అండ్ జెర్రీ వార్ గురించి చెప్పుకునేది ఏముంది. వీరిద్దరు ఎప్పుడు కలుసుకున్నా మీడియాకు పండగే. చురకలు, సెటైర్లతో వీరి మధ్య సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. వజ్రోత్సవాల్లో లెజెండ్, సెలబ్రిటీ వ్యవహారం ఎంత చిచ్చు రేపిందో, ఆపై పద్మభూషణ్ సందర్భంగా మోహన్ బాబు, పవన్ మధ్య సంభాషణలు ఎవరూ మరిచిపోలేదు. అయితే ఆపై పరిస్థితులు మారాయి. ఒకరి ఇంట్లో వేడుకలకు ఒకరు హాజరవ్వటం, పంక్షన్లలో కలుసుకోవటం చూస్తున్నాం.

ఇక ఇప్పుడు వీరిద్దరు మరోసారి ఒకే స్టేజీపై కనువిందు చేయబోతున్నారు. తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలతో .. విలక్షణమైన నటుడిగా మోహన్ బాబు 40 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలోని 'లలిత కళా పరిషత్' మోహన్ బాబుకి 'నవరస నట తిలకం' పురస్కారాన్ని అందించనుంది. వైజాగ్ లోని మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 17వ తేదీన ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఈ వేడుకకి సౌత్ లోని పలువురు సినీ సెలబ్రిటీలంతా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ వేడుకకి 80, 90ల్లోని టాప్ హీరో, హీరోయిన్లు, పలువురు అగ్రదర్శకులు కూడా హాజరుకానున్నారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆహ్మానం అందింది. మరి సన్నిహితుడి పంక్షన్ కి హాజరుకాకుండా ఉంటాడా చెప్పండి? అందుకే  'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ, మోహన్ బాబు కోసం ఆయన తీరిక చేసుకుని వైజాగ్ బయలుదేరబోతున్నాడు. ఇప్పుడు వస్తున్న డౌట్ ఏంటంటే... స్టేజీపై చిరు మోహన్ బాబు గురించి ఏం మాట్లాడతాడా అని?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  Chiranjeevi  Mohan babu  40 years celebrations  

Other Articles