షార్ట్ ఫిల్మ్ లో జర్నలిస్ట్ గా సింగర్ సునీత | Singer Sunitha reveal her role in Raagam short film

Singer sunitha reveal her role in raagam short film

Singer Sunitha reveal her role, Singer sunitha role in short film, Singer Sunitha Raagam Short Film, Raagam Telugu Short Film, Singer Sunitha Raagam, Singer sunitha short film

Singer Sunitha reveal her role in Raagam short film.

రియల్ లైఫ్ దగ్గరగానే సినిమానా?

Posted: 09/12/2016 03:36 PM IST
Singer sunitha reveal her role in raagam short film

చిన్నవయసులోనే సింగర్ గా గుర్తింపుపొంది టాప్ హీరోల సినిమాల్లో పాటలు పాడి అంతే స్పీడ్ గా కనిపించకుండా పోయింది సునీత. వ్యక్తిగత వ్యవహారాలు తన లైఫ్ ని ఎంతగా కుంగదీశాయో ఈ మధ్య స్వయంగా తానే ఓపెన్ కావటంతో అంతా బయటకు వచ్చింది. ఇక సినిమాల్లో ఆఫర్లు తగ్గాక టీవీషోల్లో జడ్జిగా, విదేశాల్లో ఈవెంట్స్ లో పాల్గొంటూ కాలం వెలదీసింది. అయితే మధ్యలో సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఎందుకో లైట్ తీస్కుంది.  

కానీ, ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు రాబోతున్నట్లు తానే స్వయంగా అనౌన్స్ చేసింది. రోలింగ్ రీల్ ఎంటర్ టైన్మెంట్- రేణుక టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఓ షార్ట్ ఫిల్మ్ ని తెరకెక్కిస్తున్నాయి. ఇందులో సునీత ఓ పాత్రలో నటిస్తోంది. ఆమె ఒప్పుకుంది అనగానే ఆమె పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటాయోనని చాలామందిలో ఆసక్తికి లోనయ్యారు. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. అందులో ఆమె జర్నలిస్టుగా కనిపించనుందట.

ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెబుతోంది. మహిళల సమస్యలకి సంబంధించిన ఇతివృత్తంతో ఈ కథ తెరకెక్కనుందని వివరించింది. ఈ సినిమాలోని పాత్ర .. నిజ జీవితంలో తన స్వభావానికి చాలా దగ్గరగా ఉందనీ, అందువలన ప్రతి సీన్ సింగిల్ టేక్ లో చేయగలిగానని చెప్పింది. ఇందులో వృత్తి రీత్యా జర్నలిస్టునే అయినా, ఆ పాత్రకి పాటలు పాడటమంటే చాలా ఇష్టమని అంది. ఎవరిపై ఆధారపడటం ఇష్టంలేని మహిళ పాత్రను పోషించడం తనకి చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చింది. అన్నట్లు ఈ సినిమా పేరు ఏంటో తెలుసా రాగం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer Sunitha  Debut  Short Film  Raagam  

Other Articles