మెగా ఐటెం సాంగ్ లో కేథరిన్ కన్ఫర్మ్ | catherine item song for khaidi no 150 in lavish set

Catherine item song for khaidi no 150 in lavish set

catherine item song, chiru 150 item song, Khaidi no 150 item song, special item song for Chiru, Chiru 150 item song, lavish set for Chiru movie, Chiru item song, 150 item song

catherine tresa special song for Chiru 150 in lavish set and special beats.

మెగా స్పెషల్ అట్రాక్షన్ కోసం...

Posted: 09/07/2016 10:19 AM IST
Catherine item song for khaidi no 150 in lavish set

చాలా కాలం గ్యాప్ తర్వాత మెగాస్టార్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో 'ఖైదీ నంబర్ 150' అందరిలోనూ ఎంతో ఆసక్తిని, కుతూహలాన్ని కలిగిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంటోంది. ప్రత్యేక పాత్రలతోపాటు ఐటెం సాంగ్ కూడా హైలైట్ చేయాలని రాంచరణ్ భావిస్తున్నాడు.  

ఈ ప్రత్యేక పాటను ప్రముఖ హీరోయిన్ చేత చేయించాలని చెర్రీ చాలా పేర్లనే పరిశీలించాడు. ఈ క్రమంలో బాలీవుడ్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, చివరికి కేథరిన్ థెస్ ను ఈ పాటకు ఎంచుకున్నట్టు సమాచారం. భారీ వ్యయంతో రిచ్ నెస్ ఉట్టిపడేలా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ప్రత్యేకంగా భారీ సెట్స్ వేస్తున్నారు.

ఈ పాటకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి బీట్ తో మాస్ ట్యూన్ ను చేస్తున్నాడు. అలాగే చిరంజీవి తన డ్యాన్సుల సత్తాను మరోసారి ఈ పాటలో చూపించనున్నారట. దీనిని ఇక ఈ పాట చిత్రీకరణను అక్టోబర్ మొదటి వారంలో చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  150 movie  Item song  Catherine Tresa  

Other Articles