రికార్డులను తిరగరాస్తున్న ఎన్టీయార్ జనతా గ్యారేజ్ Janatha Garage earns Rs 50 crore, breaks records

Janatha garage earns rs 50 crore breaks records

janatha garage, jr ntr, jr ntr film,janatha garage box office, jr ntr janatha garage, janatha garage box office collections, janatha garage movie, janatha garage images, mohanlal, mohanlal film, mohanlal janatha garage, janatha garage stills, janatha garage cast, box office news, janatha garage film, janatha garage news, janatha garage photos, entertainment photos

Jr NTR and Mohanlal's Janatha Garage has been going through records like nobody's business. The Telugu film has already earned Rs 50 crore in four days and is expected to go for strength to strength.

రికార్డులను తిరగరాస్తున్న ఎన్టీయార్ జనతా గ్యారేజ్

Posted: 09/06/2016 06:51 PM IST
Janatha garage earns rs 50 crore breaks records

యంగ్ టైగర్, నందమూరి నటవారసుడు జూనియర్‌ ఎన్టీఆర్‌, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్  నటించిన తాజా సినిమా 'జనతా గ్యారేజ్‌' బాక్సాఫీసు కలెక్షన్ల వద్ద కొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ప్రకృతి ప్రేమికుడిగా సరికొత్త పాత్రలో తారక్‌ విభిన్నంగా కనిపించిన ఈ సినిమా.. రికార్డులను బద్దలుకొడుతూ ముందుకుసాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా..' నాలుగురోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్‌ను దాటింది. తద్వారా టాలీవుడ్‌లో 'బాహుబలి' తర్వాత అత్యంత వేగంగా రూ. 50 కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమాగా 'జనతా గ్యారేజ్‌' రికార్డు సృష్టించింది.

సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా.. ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌ వంటి భారీ తారాగణం ఉండటం 'జనతా గ్యారేజ్‌'కు ప్లస్‌ అయింది. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్‌ చూపిన అభినయానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాకు రివ్యూలు ఎలా వచ్చినా తొలిరోజు వసూళ్లు మాత్రం దుమ్మురేపాయి. ఏకంగా తొలిరోజు రూ. 21 కోట్లు కొల్లగొట్టిన 'జనతా గ్యారేజ్‌'.. నాలుగో రోజైన ఆదివారం రూ. 5 కోట్లు మాత్రమే సాధించినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఈ సినిమా దాదాపు రూ. 9.31 కోట్ల (1.4 మిలియన్‌ డాలర్ల) వసూళ్లు రాబట్టింది.

డివైడ్‌ టాక్‌ వచ్చినా పవన్‌ కల్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌', మహేశ్‌ బాబు 'బ్రహ్మోత్సవం' తొలి వీకెండ్‌లో మంచి వసూళ్లు రాబట్టాయి. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' రూ. 40 కోట్లు, 'బ్రహ్మోత్సవం' రూ. 30 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ రెండు సినిమాలను అధిగమించి భారీస్థాయిలో తారక్‌ సినిమా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. అమెరికాలో మిలియన్‌ డాలర్‌ మార్క్‌ కలెక్షన్లను సాధించిన ఎన్టీఆర్‌ నాలుగో సినిమా ఇది. ఇంతకుమునుపు నాన్నకు ప్రేమతో, టెంపర్‌, బాద్షా సినిమాలు అగ్రరాజ్యంలో మిలియన్‌ డాలర్లకుపైగా వసూళ్లు సాధించాయి. టాక్‌ ఎలా ఉన్నా 'జనతా గ్యారేజ్‌' వసూళ్లు స్థిరంగా ఉండటంతో మున్ముందు కలెక్షన్లపరంగా మరిన్ని రికార్డులు ఈ సినిమా సృష్టించవచ్చునని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janatha Garage  box office collection  Jr NTR  Mohanlal  koratala shiva  tollywood  

Other Articles

Today on Telugu Wishesh