రజనీకాంత్ తో అమలాపాల్ | Amala Paul in Rajanikanth and pa Ranjith movie

Amala paul in rajanikanth and pa ranjith movie

Amala Paul Rajanikanth, Rajani ranjith movie heroine fix, Dhanush behind Amala paul movie offers, Amala Paul Dhanush relation, Dhanush behind amala paul divorce, Rajanikanth Amala Paul

Amala Paul in Rajanikanth's next under pa Ranjith direction.

విడాకుల దెబ్బకి అమల సుడి తిరిగింది

Posted: 09/01/2016 03:29 PM IST
Amala paul in rajanikanth and pa ranjith movie

నటి అమలాపాల్ వైవాహిక బంధం తెగిపోవటంతో ఆమె పేరు గత రెండు నెలలుగా మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. పెళ్లయ్యాక కూడా ఆమె సినిమాల్లో కొనసాగటం ఇష్టం లేని భర్త, దర్శకుడు విజయ్ ఆమెతో తెగదెంపులు చేసుకోవటం, అది కోర్టు మెట్లు ఎక్కి విడాకుల దాకా వెళ్లటం తెలిసిందే. ఇక ఆమె పని అయిపోయిందని, సినిమాలో ఛాన్సులు రావటం తగ్గిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అలా జరక్కపోగా, బంపరాఫర్లు ఆమె ఖాతాలోకి వచ్చిపడుతున్నాయి.

ధనుష్ వడ చెన్నై నుంచి వాకౌట్ అయ్యిందన్న పుకార్లను కొట్టిపడేస్తూ ఈ మధ్యే షూటింగ్ లో కూడా జాయిన్ అయిన అమల ఇప్పుడు భారీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. రోబో 2 తర్వాత రజనీకాంత్, కబాలి దర్శకుడు పా రజింత్ తో సినిమా తీయబోతున్నాడని తెలిసిందే. దీనికి నటుడు, రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో అమలను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ధనుష్ కి, అమలకి వీఐపీ(రఘువరన్ బీటెక్) చిత్రం నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత అమలాను లీడ్ పెట్టి అమ్మ కనక్కు అనే చిత్రాన్ని ధనుష్ నిర్మించాడు.  ఆపై వడచెన్నై చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. అసలు ఈ చిత్ర సమయంలోనే విజయ్-అమలల మధ్య చిచ్చు రగిలి, విడాకుల దాకా వెళ్లిందనేది తెలిసిందే. తన (చిత్రం) వల్లే స్నేహితురాలి జీవితం ఇలా అయిపోతుందని ఫీలవుతున్న ధనుష్ ఇలా ఆపర్ల మీద ఆఫర్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడంట. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ తో సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajanikanth  Amala Paul  Pa Ranjith  movie  

Other Articles

Today on Telugu Wishesh