కేన్సర్ చిన్నారి కోసం ఉల్లిపాయలు అమ్మిన్ పవన్ అభిమానులు | Pawan fans sold onions for cancer patient

Pawan fans sold onions for cancer patient

Pawan Kalyan fans sold onions, Pawan Kalyan fans sell onions, pawan fans cancer patient, Pawan fans cancer patient Lavanya, Pawan fans help to cancer patient

కేన్సర్ చిన్నారి కోసం ఉల్లిపాయలు అమ్మిన్ పవన్ అభిమానులు | Pawan fans sold onions for cancer patient

కేన్సర్ చిన్నారి కోసం కదిలిన పవన్ ఫ్యాన్స్

Posted: 09/01/2016 05:29 PM IST
Pawan fans sold onions for cancer patient

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా కార్యక్రమాల్లో కూడా ఎల్లప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న వారి కోసం నడుం బిగించి, ఆదుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాగే మరోసారి తమదైన శైలిలో ఓ మంచి పని చేశారు. కేన్సర్ తో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆదుకునేందుకు వారంతా ముందుకు వచ్చారు. ఇందుకోసం రోడెక్కి ఉల్లిపాయలు అమ్మారు.

పశ్చిమగోదావరి జిల్లా బాడవ గ్రామానికి చెందిన లావణ్య(7) కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. చికిత్సకు రూ.12 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు. దీంతో, కూలీ పనులు చేసుకునే లావణ్య తల్లిదండ్రులు దాతల సాయం కోరారు. వెంటనే స్పందించిన పవన కల్యాణ్ అభిమానులు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పవన్ అభిమానులు ఉల్లిపాయలు అమ్మారు.

pawan fans sell onions for cancer kid

అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు సాయం నిమిత్తం తాము ఉల్లిపాయలు అమ్ముతున్నామని, సాయ పడాలంటూ బ్యానర్లతో ప్రచారం చేశారు. దీంతో, ఎమ్మెల్యే నుంచి కౌన్సిలర్ వరకు పలువురు ప్రముఖులు ఉల్లిపాయలు కొనుగోలు చేశారు. ఉల్లిపాయలను విక్రయించడం ద్వారా రూ.50 వేల నగదు వచ్చింది. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా రేపు ఈ మొత్తాన్ని కేన్సర్ బాధితురాలు చిన్నారి లావణ్య పేరెంట్స్ కు అందజేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  fans  west godavari  sell  onions  cancer patient  lavanya  

Other Articles