జ్యో అచ్యుతానంద కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన అవసరాల | Avasarala released Jyo Achyutananda new poster

Rajamouli doubt clarifies by avasarala jyo achyutananda new poster

Jyo Achyutananda heroines, Avasarala released Jyo Achyutananda new poster, Jyo Achyutananda new poster, nara rohit and naga shourya heroines

Avasarala released Jyo Achyutananda new poster, reveal secret that nara rohit and naga shourya had another heroines.

జక్కన్న డౌట్ ను క్లియర్ చేసేశాడా?

Posted: 08/31/2016 12:10 PM IST
Rajamouli doubt clarifies by avasarala jyo achyutananda new poster

కొత్త కాన్సెప్ట్ లతో జనాలను థ్రిల్ చేయటం ఈ మధ్య వస్తున్న యంగ్ డైరక్టర్లకు ఓ అలవాటుగా మారింది. సీనియర్లంతా మూస ధోరణితో ఒకే టైప్ ఆఫ్ కథతో వెళ్తుంటే... కథా, కథనంలో కొత్తదనం, వైవిధ్యం చూపుతున్నారు కొందరు యువ దర్శకులు. నటుడి నుంచి దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ కూడా టేకింగ్ లో ఢిపరెంట్ జోనర్ నే ప్రదర్శిస్తున్నాడు.

మొదటి చిత్రం ఊహలు గుసగుసలాడే తో సక్సెస్ అందుకున్న అవసరాల ఇప్పుడు జ్యో అచ్యుతానందతో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. అన్నదమ్ములకు, ఓ అమ్మాయికి మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ట్రైలర్ లో చెప్పకనే చెప్పిన అవసరాల చివరకు ఏమౌతుందన్న విషయంలో సస్పెన్స్ నే క్రియేట్ చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి కూడా తనకిది థ్రిల్లర్ సినిమా అనిపిస్తోందని, హీరోయిన్ రెజీనా ఇద్దరిలో ఎవరి ప్రేమకు ఓకే చెబుతుందా అన్న సస్పెన్స్ క్రియేట్ చేశాడంటూ అవసరాలపై పొగడ్తలు కురిపించాడు.

ఇదిలా ఉండగా అవసరాల గత రాత్రి తన ఫేస్ బుక్ లో ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. అక్కడ ఈ ట్విస్ట్ కి క్లారిటీ ఇచ్చేశాడు. ఇందులో నారా రోహిత్, నాగ శౌర్యలకు జంటలుగా వేరే అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఇక రెజీనాతో ఇంకో హీరో శశాంక్ ను కూడా నటింపజేసినట్లు అర్థమౌతోంది. అంటే సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు, వారికి ముగ్గురు హీరోలు ఉన్నారన్న మాట. మొత్తం మీద ఈ రొమాంటిక్ కామెడీపై అనవసరపు హైప్ పెంచడం ఎందుకు అనుకున్నాడో ఏమో సింపుల్ గా పోస్టర్ తో అసలు సీక్రెట్ రివీల్ చేసి చేతులు దులుపుకున్నాడు అవసరాల. అన్నట్లు జ్యో అచ్యుతానంద క్లీన్ యూ సర్టిఫికెట్ తో సెప్టెంబర్ 9న విడుదలకు సిద్ధమైపోయింది.

Jyo Achyutananda poster

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyo Achyutananda  avasarala srinivas  new poster  heroines  

Other Articles