ధనుష్ నిర్మాతగా రజనీకాంత్ సినిమా | Rajinikanth again with Pa Ranjith under hero Dhanush's production

Rajinikanth again with pa ranjith under hero dhanush s production

Rajinikanth again with Pa Ranjith, Rajanikanth in Dhanush's production, Rajanikanth in Dhanush's movie, Rajinikanth Pa Ranjith, Rajinikanth Pa Ranjith second movie, kabali combo again

Rajinikanth again with Pa Ranjith under hero Dhanush's production.

రజనీ నిర్మాత, దర్శకుడు మారిపోయారు

Posted: 08/30/2016 12:36 PM IST
Rajinikanth again with pa ranjith under hero dhanush s production

సినిమా సినిమాకి కనీసం రెండేళ్ల గ్యాప్ తీసుకుంటున్నాడు సూపర్ స్టార్ రజనీ కాంత్. అనారోగ్య కారణాలతోనే ఆయన గత చిత్రాలన్నీ దాదాపు లేట్ గానే రిలీజ్ అయ్యాయి. అయితే కబాలి తర్వాత రోబో 2 షూటింగ్ లో వెంటనే పాల్గొంటున్నాడు తలైవా. అంతేకాదు తన టాకీ పార్ట్ ను త్వరగతిన పూర్తి చేసి మరో సినిమాను కూడా ఓకే చేసి రెండూ వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు గౌతమ్ మీనన్ తో ఆయన తదుపరి చిత్రం ఉండబోతుందని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కథ ఇంకా పూర్తిగా సిద్ధం కాకపోవటం, పైగా గౌతమ్ మీనన్ ఇప్పుడు ధనుష్ తో చేస్తున్న సినిమా ఆలస్యం అవుతుండటంతో ఉన్న పళంగా రజనీ దర్శకుడు మారిపోయాడని తెలుస్తోంది. అది ఎవరో కాదు... కబాలి దర్శకుడు పా రంజిత్. అవును అతనితోనే రజనీ తర్వాతి సినిమా ఉండబోతుందట. అది కూడా అల్లుడు ధనుష్ నిర్మాతగా అని తెలుస్తోంది. వుండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై ధనుష్ నిర్మించే సినిమాలో రజనీ హీరోగా నటించడానికి అంగీకరించాడు. దీనికి 'కబాలి' దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తాడు అంటూ తన ట్విట్టర్ లో ధనుష్ ప్రకటించాడు.  "సూపర్ స్టార్ రజనీతో మా తదుపరి చిత్రాన్ని నిర్మించనున్నామని తెలియజేయడానికి చాలా గర్వంగా వుంది' అంటూ ధనుష్ పేర్కొన్నాడు.

కాగా, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ 'రోబో' సీక్వెల్ చేస్తున్న సంగతి విదితమే. ఇది పూర్తవగానే ధనుష్ సినిమా మొదలవుతుంది. ఇక పా రంజిత్ సూర్యతో ఓ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, కబాలి ఫలితంతో సూర్య వెనకడుగు వేశాడని, ఈ గ్యాప్ లోనే రజనీ సినిమా ఓకే అయ్యిందట. అయితే ఇది కబాలి సీక్వెల్ అని కొందరు అంటుంటే, సూర్య తో చేయాల్సిన కథ అని ఇంకోందరు చెప్పుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Pa Ranjith  Dhanush  producer  

Other Articles