కొరటాల శివ జనతా గ్యారేజ్ ఇంటర్వ్యూ | koratala Siva excited on how fans receive Janatha Garage

Koratala siva excited on how fans receive janatha garage

Koratala Siva about NTR, koratala Siva about Mohan Lal, koratala Siva excited, koratala Siva on Janatha Garage, Janatha Garage promotions, Janatha Garage Review, Janatha Garage Telugu Movie Review, Janatha Garage movie Review, NTR Janatha Garage Review, excited elements in janatha garage

koratala Siva excited on how fans receive Janatha Garage.

ఆ ఒక్క విషయంలోనే టెన్షన్

Posted: 08/30/2016 09:45 AM IST
Koratala siva excited on how fans receive janatha garage

జనతా గ్యారేజ్ ఆసక్తి రేపుతున్న కథ, కాంబినేషన్ ఇలా ప్రతీ విషయంలో సినిమాపై అంచనాలు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్దీ పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో గ్యారేజ్ టీంలోనే కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోనూ ఇప్పుడు టెన్షన్ పెరిగిపోతుంది. అయితే తన విషయంలో మాత్రం లెక్క వేరుగా ఉంది అంటున్నాడు దర్శకుడు కొరటాల శివ.  చిత్ర ప్రమోషన్ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంటున్నాడు శివ.

అక్కడి అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి

చిత్ర షూటింగ్ మొదలైన రోజు నుంచి ఈ క్షణం దాకా తను చాలా ఎగ్జయింగ్ తో ఉన్నానని, పరీక్ష రాసిన రిజల్ట్ కోసం ఎదురు చూసే పిల్లాడిలా తన పరిస్థితి ఉందన్నాడు.  సినిమా ఎంత హిట్టవుతుందనే ఆలోచన కంటే.. ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆసక్తి తనలో ఎక్కువ ఉందని చెబుతున్నాడు. ‘‘ఈ కథ గురించిన ఆలోచన రాగానే దీనికి కేవలం ఎన్టీఆర్ మాత్రమే సరిపోతాడని అనుకున్నా. స్క్రిప్టు విన్నప్పుడు ఎన్టీఆర్ స్పందించిన తీరుతో ఇక పూర్తిగా ఫిక్సయిపోయాను. ఒక నటుడు ఓ కథ విషయంలో ఎంతగా ఎగ్జైట్ అవుతాడన్నది దర్శకుడికి చాలా ముఖ్యం. అదే టైంలో నన్ను ఎలా ఎగ్జైట్ చేయాలో కూడా ఎన్టీఆర్ కు చాలా బాగా తెలుసు. ప్రతి హీరోకూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అలాగే తారక్ కి కూడా ఉంది. ఎన్టీఆర్ ను ఇప్పటిదాకా ఎవరూ చూపించని విధంగా తాను చూపించాననే ధీమాతో ఉన్నట్లు కొరటాల చెప్పాడు.  

ఇక మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ... తెలుగులో స్టార్లు లేనట్లు మళయాళం నుంచి ఆయన్ని దింపాల్సిన పరిస్థితి ఏంటని పలువురు నాపై విమర్శలు కురిపించారు. ఐతే కొన్ని పాత్రలకు కొందరు నటులై సూటవుతారని.. మోహన్ లాల్ చేసిన పాత్ర కూడా అలాంటిదే అని.. ఆయనే ఆ పాత్రకు కరెక్ట్ అని వివరించాడు. ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని నేను భావించాను. తెరమీద కూడా వారి జోడీ అలాగే కనిపించింది. అలాగని సినిమాకి అసలు హీరో కథ మాత్రమే. వారు ఆ కథను తన పాత్రలతో ఫీక్స్ లోకి తీసుకెళ్లారు అంటూ చెప్పుకొచ్చాడు. కొరటాల అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే సినిమా అవుట్ పుట్ ఏ స్థాయిలో వచ్చి ఉంటుందో ఊహించుకోవచ్చు. సో.. ఫ్యాన్స్ టికెట్ కౌంటర్ల దగ్గర వెయిటింగ్ చేసేందుకు సిద్ధమైపోండి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Koratala Siva  interview  

Other Articles