చార్మినార్ దగ్గర ఫ్రీకీ అలీ చిత్ర యూనిట్ సందడి | Freaky Ali team promotions in Hyderabad, Nawazuddin Siddiqui selling boxers at Charminar

Nawazuddin siddiqui selling boxers at charminar

Nawazuddin Siddiqui selling boxers, Freaky Ali movie promotions, Freaky Ali movie team at Charminar, Hero selling boxers at Charminar, Nawazuddin Siddiqui at Charminar, Nawazuddin Siddiqui in Hyderabad, Freaky Ali movie promotions in Hyderabad, Freaky Ali team at Hyderabad

Nawazuddin Siddiqui selling boxers at Charminar in part of Freaky Ali movie promotions.

చార్మినార్ దగ్గర చెడ్డీలు అమ్మిన విలక్షణ నటుడు

Posted: 08/26/2016 05:53 PM IST
Nawazuddin siddiqui selling boxers at charminar

సినిమాల‌ ప్రచారం కోసం చిత్ర యూనిట్ లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇందులో బాలీవుడ్ రూటే సప‌రేటు. పెద్ద హీరోల దగ్గరి నుంచి చిన్న హీరోల దాకా తమ సినిమాల ప్రమోషన్ల కోసం ఎంత దాకా అయిన వెళ్తారు. ఓ వైపు టీవీల్లో , ఇంకోవైపు సోషల్ మీడియాల్లోనే కాదు, జనాల్లోకి వెళ్లి కూడా ప్రచారం చేసేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ కూడా అలాగే హైద‌రాబాద్‌లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు.

ఏకంగా చార్మినార్ రోడ్లపై చెడ్డీలు అమ్ముతూ దర్శనమిచ్చాడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందిన 42 ఏళ్ల సిద్ధిఖీ  1999లో అమీర్ సర్ఫరోష్ తోనే కెరీర్ ప్రారంభించినప్పటికీ, బ్రేక్ రావటానికి చాలా ఏళ్లు పట్టింది. తలాష్, కహానీ, బద్లాపూర్, భజరంగీ భాయ్ జాన్ లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సల్మాన్ సోదరుడు సోహైల్ అలీఖాన్ దర్శకత్వంలో 'ఫ్రీకీ అలీ' అనే సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు.

పేవ్మెంట్ చెడ్డీల వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించిన అలీ అనే అబ్బాయి దేశం గ‌ర్వించ‌ద‌గ్గ‌ పెద్ద గోల్ఫ్ క్రీడాకారుడుగా త‌యారు కావ‌డ‌మే ఈ సినిమా కథాంశం. అందుకే  చార్మినార్ వ‌ద్ద చెడ్డీలను విక్రయిస్తూ త‌న సినిమాని ప్రచారం చేసుకున్నాడు. సిద్ధీఖీ చెడ్డీలు అమ్ముతుండ‌డం చూసిన జ‌నం చిరున‌వ్వులు చిందిస్తూ అత‌డితో ముచ్చటిస్తూ ఎంజాయ్ చేశారు. సిద్ధిఖీతోపాటు సోహైల్ , చిత్ర బృందం ఈ సందర్భంగా అక్కడ సందడి చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nawazuddin Siddiqui  selling boxers  Charminar  Hyderabad  Freaky Ali movie promotions  

Other Articles