ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కి యూ బై ఏ సర్టిఫికెట్ | Janatha Garage censor completed

Janatha garage censor completed

Janatha Garage censor completed, Janatha Garage censor talk, Janatha Garage U/A, Janatha Garage first talk, NTR Janatha Garage censor, Janatha Garage censor details

Janatha Garage censor completed got U/A

జనతా గ్యారేజ్ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది

Posted: 08/26/2016 06:51 PM IST
Janatha garage censor completed

యంగ్ టైగర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న జనతాగ్యారేజ్ సెన్సార్ పూర్తి అయ్యింది. యూ బై ఏ సర్టిఫికెట్ తో బోర్డు సినిమా రిలీజ్ కు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని చిత్ర పీఆర్వో మహేష్ కోనేరు తన ట్విట్టర్ అకౌంట్లో తెలియజేశాడు. జనతా గ్యారేజ్ సెన్సార్ మధ్యాహ్నానికే పూర్తయిందని, ప్రిమియర్ షోల కోసమని ప్రింట్ లను పంపించేసినట్లు ఆయన తెలియజేశాడు.

మధ్యాహ్నం 3 గంటల సమయంలో సెన్సార్ బోర్డు సభ్యులు స్పెషల్ షో చూశాక, విడుదలకు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిత్రంపట్ల బోర్డు సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని, ఆపై అందుతున్న ఫీడ్ బ్యాక్ ను ఆధారంగా చిత్రం బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సోషల్ మెసేజ్ తో కూడుకున్న ఈ సినిమాలో మోహన్ లాల్, ఎన్టీఆర్ పోటాపోటీగా నటించారంట. నిత్యామీనన్ ఓ ప్రధాన పాత్ర పోషించిందని, చిత్రం ఆధ్యంతం ఎమోషనల్ గా తెరకెక్కించాడంట కొరటాల శివ.

40 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ కి చాలా కీలకం. ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభించిన చిత్ర యూనిట్ అందుకోసం భారీగానే ఖర్చుపెడుతోంది. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా బారీగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  censor  U/A  

Other Articles