జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ మొదలు, రికార్డు స్థాయిలో బాలీవుడ్ రైట్స్ | janatha garage promotions starts

Janatha garage promotions starts

janatha garage promotions, janatha garage hindi price, janatha garage north business, janatha garage updates

janatha garage promotions starts, record price for Hindi rights in NTR Career.

గ్యారేజ్ సందడి మొదలుపెట్టారు

Posted: 08/25/2016 12:37 PM IST
Janatha garage promotions starts

థియేటర్లో సందడి చేయడానికి జనతా గ్యారేజ్ సందడికి మరో వారమే ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, దర్శకుడు కొరటాల, కథానాయకుడు ఎన్టీఆర్ ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించారు. రెడియో స్టేషన్లు, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికరమైన విశేషాలను ప్రస్తావిస్తున్నారు.

ఈ సినిమా దర్శకుడు కొరటాల, ఎన్టీఆర్, సమంతా, నిత్యామీనన్ లు అంతా కూడా వరుస సక్సెస్ లతో జోరుమీద వున్నవారే. అలాంటి ఈ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా కోసం, అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 'శ్రీమంతుడు'లో గ్రామాల దత్తత లాంటి సోషల్ మెసేజ్ ఇప్పటించిన కొరటాల, ఈ సినిమాలో ఎన్టీఆర్ తో మొక్కల పెంపకం గురించిన చెప్పించడం విశేషం.

ఇక రికార్డులు బద్ధలు కొట్టడంపై కూడా గ్యారేజ్ దృష్టిసారించింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే... ఉత్తరాది రైట్స్ కూడా 65 లక్షలకి అమ్ముడయ్యాయంట. ఇప్పటిదాకా ఎన్టీఆర్ కెరియర్ లో ఇది హయ్యెస్ట్ రేట్ కావటం విశేషం.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలకమైన పాత్ర పోషించడమే కాదు మలయాళంలో ఆయనే రిలీజ్ చేస్తుండటంతో బిజినెస్ కూడా భారీగాే జరిగింది. ఇన్ని హంగులున్న జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరియర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతోపాటు, కొరటాలకి హ్యాట్రిక్ హిట్ దక్కడం ఖాయమని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janatha garage  promotions  Hindi rights  

Other Articles