రాంచరణ్ ధ్రువ రిలీజ్ తేదీ ఖరారు | ram charan dhruva release date fixed

Ram charan dhruva release date fixed

Allu Aravind announced ram charan dhruva release date, ram charan dhruva release date, dhruva release date, ram charan dhruva look

Allu Aravind announced ram charan dhruva release date on October 7th.

ధ్రువ డేట్ లాక్ చేసుకోండి

Posted: 08/25/2016 10:43 AM IST
Ram charan dhruva release date fixed

మెగా పవర్ స్టార్ రాంచరణ్ అప్ కమింగ్ మూవీ ధ్రువ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకోంటోంది. ఓవైపు హోం ప్రోడక్షన్ లో తండ్రి తో సినిమాను తీస్తూనే, మరోవైపు నిర్విరామంగా ధ్రువలో పాల్గొంటున్నాడు.  కొన్నాళ్ల క్రితం షూటింగ్ లో జాప్యం జరుగుతుందని, స్క్రిప్ట్ అండ్ టేకింగ్ విషయంలో చెర్రీకి సూరీకి చెడిందనే వదంతులు వ్యాపించాయి.

అయితే అదంతా ఉత్తదేనని, సినిమా విషయంలో ఎలాంటి జాప్యం ఉండబోదని, అనుకున్న టైం ప్రకారం సినిమా దసరాకే వస్తుందని ప్రకటించాడు నిర్మాత అల్లు అర్జున్. అంతేకాదు ముందు అనౌన్స్ చేసిన తేదీ అక్టోబర్ 7వ అదే తేదీని ఖరారు చేస్తున్నట్టుగా చెప్పేశాడు.

చరణ్ కొత్త లుక్ తో, అరవింద స్వామి పాత్ర సినిమాకు హైలెట్ అవుతాయని, ఈ రెండే ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటాయని చెబుతున్నాడు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి ఈ సినిమా టాకీ పార్టీ పూర్తవుతుందనీ, మధ్యలో ఆడియో రిలీజ్ చేసి, ఆపై ప్యాచప్ పాటలను కూడా ఫినిష్ చేసి అంతా సిద్ధం చేస్తామని అరవింద్ ప్రకటించాడు. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు వరుసగా వాయిదాలు పడుతున్న నేపథ్యంలో నిర్మాత అరవిందే స్వయంగా ఈ విషయం ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ లో సందడి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva  release date  

Other Articles