చిన్నారి చాందినిని కలిసిన సమంత | samantha meet baby Chandini

Samantha meet baby chandini

samantha Prathyusha Foundation, Prathyusha Foundation baby Chandini, Samantha meet baby Chandini, Prathyusha Foundation Artificial Limb operation, Samantha baby Chandini

samantha Prathyusha Foundation helps Baby Chandini Artificial Limb operation. After that Samantha meet Chandini.

సమంత సేవా గుణానికి హాట్సాఫ్

Posted: 08/24/2016 06:20 PM IST
Samantha meet baby chandini

టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో స్టార్‌ హీరోయిన్‌గా అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సేవా కార్యక్రమాలను ఈ చెన్నై బ్యూటీ అస్సలు వదిలిపెట్టడం లేదు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారుల ముఖంలో నవ్వులు పూయిస్తోంది. అంతేకాదు అవయవ దానానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా కూడా పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది.

అనారోగ్యం బారిన పడిన తర్వాత తనకు మనిషి విలువ తెలిసి వచ్చిందని చెప్పిన సమంత, మూడేళ్ల క్రితం ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి చిన్న పిల్లకు చేయూత ఇవ్వటం ప్రారంభించింది. డబ్బుల్లేక ఆపరేషన్‌ చేయించుకోలేకపోతున్న చిన్నారులకు సాయం చేస్తోంది. ఆ మధ్య పూర్ణిమ అనే అమ్మాయి గుండె ఆపరేషన్ విషయంలో శామ్ స్పందించిన తీరు అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు మరో బాలిక విషయంలోనూ సమంత ఇదే రీతిలో స్పందించింది.

చెన్నైకి చెందిన భవానీ (చాందినీ) అనే ఐదేళ్ల బాలికకకు ఏడాది వయసులో ఉండగా ఓ రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయింది. కృతిమ కాలు కోసం ఆపరేషన్ చేయించడానికి ఆ చిన్నారి తల్లిదండ్రులకు అంత స్తోమత లేకుండాపోయింది. దీంతో విషయం తెలుసుకున్న ప్రత్యూష ఫౌండేషన్ ఆ బాలికకు సాయం చేసింది. రెండు రోజుల క్రితం మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి వర్గాలు ఆ బాలికకు ఆపరేషన్ చేయగా, అది విజయవంతం అయ్యింది. విషయం తెలుసుకున్న సమంత తానే స్వయంగా వెళ్లి చాందినీని కలుసుకుని పరామర్శించింది. పక్కవాడి ఆనందంలోనే అసలైన కిక్కును ఎంజాయ్ చేస్తున్న సమంత లాంటి వాళ్లను చూసి అభినందించకుండా ఉండలేం కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  Prathyusha Foundation  

Other Articles