నాని మజ్ను రిలీజ్ డేట్ ఫిక్స్ | nani majnu release date

Nani majnu release date

Nani Virinchi varma, Nani Majnu release, Nani Majnu release date, Majnu heroine Anu Emmanuel, Nani not competete with Charan

Nani majnu release date fixed for September 16th. Virinchi Varma Direct the movie, Anu Emmanuel in female lead.

నాని ఓవర్ కాన్పిడెన్స్ పనికిరాదు

Posted: 08/24/2016 12:50 PM IST
Nani majnu release date

వరుస ఫ్లాపులతో ఉన్నంత కాలం నానిని పట్టించుకోని దర్శకులు, వరుసగా నాలుగు హిట్లు అందుకోవటంతో క్యూ కట్టేస్తున్నారు. ప్రస్తుతం ఓ అరడజన్ చిత్రాలే నాని చేతిలో ఉన్నాయి. ఇక ఈ యేడాది ఇప్పటికే రెండు హిట్లు కొట్టి ఊపు మీద ఉన్న నాని మజ్నుగా తొందర్లోనే మన ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలోనే నానిని కాస్త తగ్గమని చెబుతున్నారు.

విరించి వర్మ దర్శకత్వం వహించిన నాని మజ్ను రిలీజ్ డేట్ సెప్టెంబర్ 16 అని తాజాగా వార్త అందుతోంది. అయితే సినిమాను మరో రెండు వారాలు ముందుకు జరిపి దసరా బరిలో ఉంచాలని నాని సూచిస్తున్నాడంట. కానీ, అదే సమయానికి రాంచరణ్ ధ్రువ రెడీగా ఉంటుంది. అయినా పోటీకి సై అంటున్నాడంట నాని. రాంచరణ్ బిజినెస్ తో పొలిస్తే నాని సినిమాకు పెద్దగా గిరాకీ లేదు. నాని సినిమాపై పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ, పైగా చెర్రీ సినిమా చాలా గ్యాప్ తో రావటం, ఆపై హిట్ రీమేక్ కావటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. థియేటర్లు కూడా మెగా వారసుడికే ఎక్కువ దక్కుతాయి. ఈనేపథ్యంలో నాని చేసేది ముమ్మాటికీ సాహసమే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సెప్టెంబర్ 1న జనతా గ్యారేజ్, 7న విక్రమ్ ఇంకొకడు, 9 న ప్రేమమ్ రాబోతున్నాయి. దీంతో ఖాళీగా 16 లేదా 23 ఈ రెండు తేదీలలో ఒక దానిని వాడుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు.  ప్రస్తుతానికైతే గోపీసుందర్ సమకూరుస్తున్న స్వరాలను ఆగష్టు 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Anu Emmanuel  Majnu  release date  

Other Articles