కత్రినా, అలియా, పరిణితి జిమ్ కష్టాలు | Katrina, Alia and Parineeti bond over intense workout session

Katrina alia and parineeti bond over intense workout session

Parineeti Chopra Share video workout session, Actress Dream Team tour, Katrina alia and parineeti video, Katrina alia and parineeti bond, Katrina bond with young actresses

Parineeti Chopra Share video with Katrina Kaif, Alia Bhatt workout session in US.

ముగ్గురు ముద్దు గుమ్మలు ఒకేసారి ఇలా...

Posted: 08/24/2016 11:19 AM IST
Katrina alia and parineeti bond over intense workout session

ఇది వరకు పరిస్థితి ఇలా లేకపోయినా, ఇప్పుడున్న హీరోయిన్లు మాత్రం తమ మధ్య పోటీ ఎంతగా ఉన్నా అవన్నీ పక్కనబెట్టి బాగా మంచి రిలేషన్ ను మెయింటెన్ చేస్తున్నారు. ఒకరి సినిమాలకు మరోకరు ప్రమోషన్లు చేయటం, ముఖ్యంగా విదేశాల్లో ప్రోగ్రాంలకు వెళ్లిన సమయంలో  కలిసి మెలిసి ఉంటున్నారు. బెల్జియంలో జరిగిన ఓ ప్రైవేయిట్ పంక్షన్ కు వెళ్లిన సమంత, రకుల్, రెజీనాలు క్లోజ్ గా మూవ్ అవ్వటమే కాదు, ఫోటోలు కూడా దిగి షేర్ చేసుకున్నారు. ఈ విషయంలో కోట్లకు కోట్లు రెమ్యునరేషన్లు తీసుకునే బాలీవుడ్ భామలు కూడా విషయంలో తక్కువేం కాదు.   

తాజాగా అమెరికాలో డ్రీమ్ టీం టూర్ పేరుతో జరుగుతున్న ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్లు సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి షారూఖ్ ఖాన్, కరణ్ జోహర్, వరుణ్ ధావన్ లతోపాటు, బ్యూటీలు కత్రినా కైఫ్, పరిణితి చోప్రా, అలియా భట్ లు కూడా హాజరయ్యారు. స్వతహాగా మంచి ఫ్రెండ్స్ అయిన ఈ ముగ్గురు ఒకేచోట చేరితే ఊరుకుంటారా? ఏం చేస్తున్నారో చూడండి.

ముగ్గురు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగటమే కాదు, కలిసి పడుకోవటం, ఇలా జిమ్ లో ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడి పోవటం చేస్తున్నారు. ట్రెడ్ మిల్ పై ఎగిరి ఎగిరి దూకుతూ, అనవసరమైన కొవ్వును కరిగించేందుకు వారు పడుతున్న ఫీట్లు బాగానే ఉన్నాయి. అన్నట్లు ఈ వీడియో మధ్యలో తాపీగా నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది ఎవరో కాదు యువనటుడు వరుణ్ ధావన్. పాపం వారు అంతగా కష్టపడుతున్నా కనీసం పట్టించుకోకుండా చెవిలో హెడ్ సెట్ పెట్టుకుని కూల్ గా అలా వెళ్లిపోతున్నాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katrina Kaif  Alia Bhatt  Parineeti Chopra  workout session video  

Other Articles