ఆది చుట్టాలబ్బాయికి థియేటర్లు పెంచారు | 100 more theatres added for Chuttalabbayi

100 more theatres added for chuttalabbayi

more theatres added Chuttalabbayi, Chuttalabbayi theaters increased, Aadi Chuttalabbayi theaters

In Nizam 100 more theatres added for Aadi Chuttalabbayi.

ఫ్లాపు సినిమాకు వంద థియేటర్లు పెంచేశారు

Posted: 08/23/2016 01:39 PM IST
100 more theatres added for chuttalabbayi

ఈరోజుల్లో ఏ సినిమా భవిష్యత్తు ఎలా మారిపోతుందో తెలీడం లేదు. చెత్త సినిమాలంటూ క్రిటిక్స్ తేల్చేసినప్పటికీ, మొదటి ఆటకే బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ రెండు, మూడు రోజులకే ఫలితాలు తారు మారు అయిపోతున్నాయి.  అల్లు అర్జున్ సరైనోడు కి మొదలైన ఈ తంతు ఇప్పటిదాకా ఓ రెండు మూడు సినిమాల విషయంలో ఇలాగే జరిగింది. ఇక ఇప్పుడు వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కున్న ఆదికి ఆ టాకే కలిసొచ్చేలా ఉంది.

ఆది చుట్టాలబ్బాయి గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. పూర్ రేటింగ్ లు ఇవ్వటంతోపాటు సినిమా అట్టర్ ఫ్లాప్ అని క్రిటిక్స్ తేల్చేశారు. 350 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి, రెండో రోజు నుంచే ఎత్తేస్తారేమోనని అంతా భావించారు. అయితే ఆడియన్స్ నుంచి ఆదరణ లభించడంతో ఆదివారం నైజాంలో 20 థియేటర్లను పెంచగా, మంగళవారం నుంచి మరో 100 థియేటర్లు పెంచిపడేశారు.

నెమ్మదిగా వసూళ్లు పుంజుకుంటుడంతో నిర్మాతలు ఈ ధైర్యం చేశారు. కాగా, 3 రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా 6 కోట్ల 30లక్షలను రాబట్టింది. ఆది కెరియర్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. జనతా గ్యారేజ్ కి పది రోజుల సమయం ఉండటం, ఈ వారం ఒక్క డబ్బింగ్ చిత్రం 100 డేస్ ఆఫ్ లవ్ తప్ప ఏం లేకపోవటం, పైగా పోటీకి వచ్చిన ఆటాడుకుందాం రా ను జనాలు తిరస్కరించడం ఆదికి ఇలా కలిసి వచ్చిందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadi  Chuttalabbayi  bad talk  Theaters  incresed  

Other Articles