జనతా గ్యారజ్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 2నే | Janatha garage release on september 2nd only

Janatha garage release on september 2nd only

Janatha Garage not preponed, Janatha Garage on time only, Janatha Garage DOP Tirrunavukarasu, Tirrunavukarasu confirms Janatha Garage release date

Janatha garage Shooting Completed, release on september 2nd only. DOP Tirrunavukarasu

గ్యారేజ్ పుకార్లు ఇక ఆపండ్రా బాబోయ్

Posted: 08/23/2016 12:04 PM IST
Janatha garage release on september 2nd only

జనతా గ్యారేజ్ రిలీజ్ ఆలిండియా బంద్ అడ్డంకిగా మారిందని, అందుకే సినిమాను ఒకరోజు ముందుగా రిలీజ్ చేయాలని చూస్తున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలని ఆలోచన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ లేదని తాజాగా కన్ఫర్మ్ అయిపోయింది. ముందుగా అనుకున్న తేదీ సెప్టెంబర్ 2నే సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ తిర్రునవుక్కరసు అఫీషియల్ గా ట్విట్టర్ లో చెప్పేశాడు.

మరోవైపు చిత్ర షూటింగ్ పూర్తయిపోయిందంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ ట్వీట్ వేయటం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. కొరటాలతో షూటింగ్ మధురానుభూతిని నింపిందంటూ తారక్ అందులో పేర్కొన్నాడు. మొత్తానికి టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తవటంతో త్వరగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఆ రోజునే రిలీజ్ చేయాలని ఫిక్సయిపోయాడన్న మాట.

కాజల్ అవుట్ ఉత్తదే:
కాస్టూమ్స్ విషయంలో అలిగిన కాజల్ సెట్స్ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాదంటూ వస్తున్న వార్తలు పుకార్లేనని తాజా ట్వీట్లతో తేలిపోయింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిదంటూ జనతాగ్యారేజ్ టీం అఫీషియల్ గా ప్రకటించి, ఆపై ఐటెం సాంగ్ కోసం కాజల్ ఇష్యూ చేసిందన్న వార్త కొందరి సృష్టేనని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janatha Garage  Release date  September 2nd  

Other Articles