నెట్ లో పరోటా సూరి రియల్ దెయ్యం వీడియో | Tamil actor comedian Parotta Soori shares creepy ghost video

Tamil actor comedian parotta soori shares creepy ghost video

Parotta Soori shares creepy ghost video, Top Comedian ghost video, Parotta Soori Ghost Video, creepy ghost video by Celebrity, Vishal friend share Ghost Video, Vishal friend Parotta Soori, South Comedian Ghost Video

Tamil actor comedian Parotta Soori shares creepy ghost video.

దెయ్యం వీడియోను షేర్ చేసిన కమెడియన్

Posted: 08/22/2016 11:48 AM IST
Tamil actor comedian parotta soori shares creepy ghost video

దెయ్యాలు ఉన్నాయా? ఆ పీలింగే కొందరికి జడుపు జ్వరాలు తెప్పించిపెడుతుంది. ఓవైపు ఆత్మలు ఉన్నాయంటూ వచ్చే కొన్ని వీడియోలు విరివిగా వైరల్ అవుతుండగా, వాటిని చూసి వెన్నులో వణుకు పుట్టే వారు కొందరు ఉండగా, అదంతా జిమ్మిక్కులంటూ కొట్టిపడేసే వారు అదే స్థాయిలో ఉన్నారు. కానీ, ఓ సెలబ్రిటీ తనకు ఎదురయిన దెయ్యం అనుభవాన్ని వీడియో తీస్తే పెడితే ఎలా ఉంటుంది.

ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ ‘పరోటా’ సూరి తాను దెయ్యాన్ని చూశానంటూ షేర్ చేసిన వీడియో నెట్ లో హాల్ చల్ చేస్తోంది. ఓ చిత్రం కోసం పళని నుంచి కొయంబత్తూర్ వెళ్తున్న సమయంలో అర్థరాత్రి 2 గంటల సమయంలో రోడ్డుపై ఎదురైన అనుభవాన్ని వీడియో తీసి మరీ ఉంచాడు.

ఎర్రగా నిప్పులు విరజిమ్ముతున్నట్టున్న ఓ ఆకృతి రోడ్డు మధ్య నిలబడినట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. సూరి కారు ఆ ఆకారానికి అతిదగ్గరగా వచ్చింది. లైట్లు ఆర్పేయాలని డ్రైవర్ కి సూచించగా, చీకట్లో ఆ ఆకారం కనిపించకుండా పోయింది. అయితే తిరిగి లైట్లు వేయగానే ఆ ఆరెంజ్ రూపం కారులో క్షణంపాటు కనిపించి మాయమైంది. భయంగొల్పే ఆ వీడియోను సూరి తన సోషల్ మీడియాలో పెట్టాడు. నాలుగు రోజుల క్రితమే ఆ వీడియోను అప్ లోడ్ చేయగా, మిలియన్ మందికి పైగానే వీక్షించారు.



కాగా, విశాల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన సూరి అతని చిత్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాడు. 'వెన్నిల కబాడి కుళు' (తెలుగులో భీమిలి కబడ్డీ జట్టుగా రీమేక్ ) తో కోలీవుడ్ కు పరిచయమైన సూరి, సుమారు 65పైగా చిత్రాల్లో నటించి టాప్ కమెడియన్ గా ఎదిగాడు. అయితే సరదాగా ఆటపట్టించేందుకు కావాలనే సూరి ఈ కల్పిత వీడియోను ఉంచాడని పలువురు అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parotta Soori  Ghost Video  Viral  

Other Articles