కమల్ హాసన్ కి ఫ్రెంచ్ పురస్కారం | Kamal Haasan chosen for France's Chevalier award

Kamal haasan chosen for france s chevalier award

Kamal Haasan chosen for France's Chevalier award, Kamal Haasan French Award, French Award for Kamal Hassan, France's Chevalier award for Kamal

Kamal Haasan chosen for France's Chevalier award.

కమల్ ఖాతాలోకి ఫ్రెంచ్ పురస్కారం

Posted: 08/22/2016 10:56 AM IST
Kamal haasan chosen for france s chevalier award

లోకనాయకుడు కమల్ హాసన్ కి మరో అరుదైన అవార్డు వచ్చి చేరింది. 61 ఏళ్ల ఈ లెజెండరీ నటుడికి తమ దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించింది ఫ్రాన్స్ . కళలు, సాహిత్య రంగంలో విశేష సేవలందిస్తున్న వారికి ఆ దేశ సాంస్కృతిక శాఖ ‘చెవాలియర్ డి  అందించే ‘ఎల్ ఆర్డర్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్ (ద నైట్ ఆప్ ద ఆర్డ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్)’ అవార్డును కమల్ కి అందజేయనున్నట్లు పేర్కొంది.

ఈ అవార్డుల్లో భాగంగా మూడో గ్రేడ్ కు చెందిన చెవాలియర్ (నైట్ యోధుడు) పురస్కారానికి కమల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు కమల్ ఎంపిక పట్ల భారతీయ సినీ పరిశ్రమ హర్షాతికేకం వ్యక్తం చేసింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులే కాకుండా రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల నుంచి కూడా కమల్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు అందిన ఈ అవార్డును తన మార్గదర్శకులు, అభిమానులకు అంకితమిస్తున్నట్లు కమల్ ప్రకటించాడు.

ఇంతవరకు ఈ అవార్డు భారత్ తరపున అమితాబ్ బచ్చన్, నందితా దాస్, షారూఖ్ ఖాన్ లు అందుకోగా, కోలీవుడ్ నట దిగ్గజం శివాజీ గణేషన్ తర్వాత కమల్ ఈ అవార్డు అందుకోబోతున్న రెండో వ్యక్తి కావటం విశేషం. తన నటనతో దక్షిణ భారతాన్నే కాకుండా యావత్తు దేశాన్ని ఆకట్టుకున్న తమిళ నటుడు కమలహాసన్... ఈ అవార్డులతో యూనివర్సల్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు. భారతీయ చలన చిత్రరంగంలో సుదీర్ఘ కాలంగా తనదైన నటనతో రాణిస్తున్న కమల్... తాజాగా ఈ ఫ్రెంచి పురస్కారం ఎంపిక కావటం పట్ల తెలుగు విశేష్ ఆయనకు కంగ్రాట్స్ చెబుతోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Hassan  France  Chevalier award  

Other Articles