దర్శకుడు శంకర్ బర్త్ డే స్పెషల్ | Director Shankar Birthday special

Director shankar birthday special

Director Shankar Birthday, Director Shankar life history, Director Shankar Birthday special, Indian Spielberg, Spielberg Shankar, Special story on Shankar

Director Shankar Birthday special story.

హ్యాపీ బర్త్ డే ఇండియన్ స్పీల్ బర్గ్

Posted: 08/17/2016 03:14 PM IST
Director shankar birthday special

పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద నిర్మాత, పెద్ద చిత్రం ఇవన్నీ ఆయన చిత్రంలోనే కనిపిస్తాయి. అదే సమయంలో కమర్షియల్ అంశాలతోపాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. 90వ దశకంలో గ్రాఫిక్స్ ను ఇండియన్ తెరపై ఆవిష్కరించి సంచలనాలకు నెలవుగా మారాడు. ఆయనెవరో కాదు భారతీయ చలన చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకుడు శంకర్. ఈరోజు (ఆగస్ట్ 17న ) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శంకర్ గురించి కొన్ని ముచ్చట్లు...
                                 
ఆగస్టు 17 న కుంభకోణంలోని ఓ చిన్న గ్రామంలో షుణ్ముగం, ముత్తులక్ష్మీ దంపతులకు జన్మించారు శంకర్ షణ్ముగం. చిన్నతనం నుంచే చదువంటే శంకర్ కి ఆసక్తి ఉండేది కాదు. అయినా తండ్రి బలవంతం మేరకు చెన్నైలోని సీపీటీ నుంచి డిప్లొమాలో మెకానికల్ ఇంజనీర్ చదివాడు. ఆ తర్వాత  స్టార్ నటుడు, ఇళయదళపతి విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించాడు. ఎ.ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో జెంటిల్మెన్ లాంటి భారీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు.

జెంటిల్మెన్ కోసం తొలుత రజనీకాంత్ ని ఎంచుకున్నప్పటికీ దర్శకుడు కొత్త వాడు అన్న కారణంతో రజనీ నో చెప్పాడంట. ఈ విషయాని రజనీయే చాలా సార్లు ఓపెన్ గా చెప్పటం విశేషం. ఆ రకంగా అదృష్టం అర్జున్ ని వరించి అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత డాన్స్ మాస్టర్ అయిన ప్రభుదేవాతో ప్రేమికుడు తీసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. జీన్స్, భారతీయుడు, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, స్నేహితుడు,  రోబో, ఐ, ఇలా వరుసగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మెగా మూవీలను అందించాడు.

అతని చిత్రాల్లో దాదాపు కోర్టు సీన్లు కామన్. సామాజిక అంశాలను జనాలను హత్తుకునేలా రూపొందించడంలో దిట్ట. ఒకే ఒక్కడుగా ఒక్క రోజు సీఎం పాత్రలో అర్జున్ ని ఆవిష్కరించాడు. అపరిచితుడితో విక్రమ్ ఫేట్ ను మార్చేశాడు. రోబోలో రజనీలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. ఇలా ఓవైపు మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు సామాజిక అంశాలను కూడా అందించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.

ఒకటి రెండు చిత్రాలు తప్ప ఆయన తీసిన చిత్రాల్లో మిగతావీ టీవీల్లో ఇప్పుడు వచ్చినా సరే ప్రేక్షకుడు టీవీకి అతుక్కుపోతారంటే అతిశయోక్తి కాదు. ఓవైపు ఒక చిత్రాన్ని మిగతా భాషల్లో కూడా ఎలా మార్కెట్ ఎలా మార్కెట్ చేయాలో అసలు నేర్పిందే ఆయన. ముఖ్యంగా తెలుగులో కూడా శంకర్ కి భీభత్సమైన క్రేజ్ ఉంది. ఐ మూవీ ఫలితం పక్కనబెడితే దానికి జరిగిన బిజినెస్ అతడి సత్తా ఏంటో తెలియజేస్తుంది.  రోబో ద్వారా అంతర్జాతీయ చలన చిత్ర స్థాయికి భారతీయ చిత్రాన్ని తీసుకెళ్లడంలో శంకర్ కృషి గణనీయమైనది. ప్రస్తుతం రోబో2 తో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైపోతున్నాడు. ఇండియన్ స్పీల్ బర్గ్ గా ముద్దుగా పిలుచుకుంటున్న డైరక్టర్ శంకర్ కి తెలుగు విశేష్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్ డే టూ శంకర్ సార్...   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Shankar  Indian Spielberg  Birthday  special story  

Other Articles