హిందీ సినిమాలే గొప్పవి కావంటున్న లెజెండ్ మేకర్ ఆదూరి గోపాలకృష్ణన్ / Adoor Gopalakrishnan sensational comments on Bollywood

Adoor gopalakrishnan sensational comments on bollywood

Legend Film Maker Adoor Gopalakrishnan, Adoor Gopalakrishnan comments on bollywood movies, Legend film maker comments on bollywood, Adoor Gopalakrishnan at 50 years celebrations

Legend Film Maker Adoor Gopalakrishnan sensational comments on Bollywood, says other languages movies also great, but we highlighted only hindi movies.

బాలీవుడ్ సినిమాలపై బాంబు పేల్చాడు

Posted: 08/17/2016 11:16 AM IST
Adoor gopalakrishnan sensational comments on bollywood

హాలీవుడ్ తర్వాత బాలీవుడ్ సినిమాలే... ఇండియన్ అఫీషియల్ సినిమా హిందీనే. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ తోపాటు, అవార్డుల పంట కోసం పంపాలన్న ప్రతీయేడు మనం వాటిపైనే చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నేపథ్యంలో లెజెండ్ ఫిల్మ్ మేకర్ ఆదూర్ గోపాలకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ సినిమాలు అసలు జాతీయ సినిమాలే కాదంటున్న ఆయన వాటికి అంత హైప్ తీసుకురావాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చారు. గోపాలకృష్ణన్ సినీ రంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ముంబైలోని గేట్‌వే లిట్‌ఫెస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీ మిగతా వాటిల్లాగే ఓ భాష. అలాంటిది కేవలం వాటిని మాత్రమే గొప్ప చిత్రాలుగా భావించి జాతీయ సినిమాగా పేర్కొనడటం తప్పని ఆయన అన్నారు.  

ఇతర భాషాల్లో కూడా చాలా గొప్ప చిత్రాలు వస్తున్నాయి. కానీ, వాటిని ప్రాంతీయ చిత్రాలంటూ తక్కువ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. నిజానికి ఈ పరిస్థితి దాపురించడానికి కారణం సగటు ప్రేక్షకుడే. సొంత భాష చిత్రాలను కాకుండా పరాయి వాటికే ప్రేక్షకుడు ప్రాధాన్యం ఇచ్చినన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుంది అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. దేశం గర్వించదగ్గ ప్రముఖ దర్శక నిర్మాత సత్యజిత్‌రాయ్‌ను ఎవరూ బెంగాలీ దర్శకుడు అని చెప్పరని, భారతదేశ దర్శక నిర్మాతగానే పేర్కొంటారని ఆయన చెబుతున్నారు.  

కేరళకు చెందిన 75 ఏళ్ల ఆదూర్ గోపాలకృష్ణన్ తొమ్మిది సార్లు ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు. భారతీయ చలన చిత్ర రంగానికి అదూర్ చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1984 లో పద్మశ్రీ తోనూ 2006 లో పద్మ విభూషణ్ తోనూ ఘనంగా సత్కరించింది. వెనిస్, హవాయి, సింగపూర్, సోచి, న్యూఢిల్లీ, బ్రజెల్స్, అలెక్సాండ్రియా లాంటి ఎన్నో ప్రదేశాల లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో జ్యూరీ సభ్యునిగా ఆదూర్ విధులు నిర్వర్తించారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Legend Film Maker  Adoor Gopalakrishnan  bollywood movies  comments  

Other Articles