చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులు అప్లై చేసిన అమల-విజయ్ | Amala Paul Vijay move family court for divorce

Amala paul vijay move family court for divorce

Actress Amala Paul divorce, Director Vijay divorce, Director Vijay on Amala Paul, Amala Paul open up about Divorce, Amala on Divorce, Amala divorce

Actress Amala Paul Director Vijay move family court for divorce.

విడాకులు కోసం కోర్టుకు అమల

Posted: 08/06/2016 04:55 PM IST
Amala paul vijay move family court for divorce

దర్శకుడు విజయ్ ఆనంద్(ఎఎల్ విజయ్), నటి అమలాపాల్ విడాకుల వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. శనివారం వీరిద్దరు చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరుకావటంతో ఈ వ్యవహారం త్వరగా తేల్చుకోవాలని వీరు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

వీరశేఖరన్ తో కెరీర్ ను ప్రారంభించిన అమలాపాల్ విక్రమ్, విజయ్ లాంటి టాప్ హీరోలతో కూడా జతకట్టింది. ఆ రెండు చిత్రాలకు కూడా ఆమె భర్త ఎ ఎల్ విజయ్ దర్శకత్వం వహించడం విశేషం. ఆ సమయంలో పీకలలోతు ప్రేమలో పడిపోయి జూన్ 12, 2014 న మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే వ్యక్తిగత సమస్యలతో ఏడాదిగా వీరద్దరు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించడమే కారణమని విజయ్ తల్లిదండ్రులు చెబుతుంటే, కారణం వేరే ఉందని భర్త విజయ్ ఓ లేఖలో మీడియాకు తెలిపాడు.

కాగా, ఈ రోజు ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి ముందు వారిద్దరూ హాజరై హిందు వివాహ చట్టం ప్రకారం తమకు విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అమలా పాల్, విజయ్లు ఇద్దరూ డబ్బు లేదా భరణం వంటి డిమాండ్లు చేయకపోవటం విశేషం. హిందూ వివాహ చట్టంలోని 13(బి) ప్రకారం, ఆరు నెలల జ్యూడిషియల్ సపరేషన్ ముగిసిన తర్వాత కూడా వీరు విడిపోతామనే అభిప్రాయం వ్యక్తం చేస్తే అప్పుడు విడాకులు మంజూరు అవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Vijay  Divorce  Chennai  Family Court  

Other Articles

Today on Telugu Wishesh