కృష్ణమ్మగా అనుష్క | Anushka Krishnamma look in Om Namo Venkatesaya

Anushka krishnamma look in om namo venkatesaya

Anushka Krishnamma look in Om Namo Venkatesaya, Anushka as Krishnamma, Krishnamma look revelaved

Anushka Krishnamma look in Om Namo Venkatesaya

ఓం నమో వేంకటేశాయాలో కృష్ణమ్మగా అనుష్క

Posted: 08/06/2016 01:46 PM IST
Anushka krishnamma look in om namo venkatesaya

కమర్షియల్ ఫార్మట్ సినిమాలకే జనాలు పెద్ద పీట వేస్తున్న ఈ రోజుల్లో అన్నమయ్య, రామదాసు, షిర్డి సాయి లాంటి భక్తిరస చిత్రాలకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని నిరూపిస్తూనే వస్తున్నాడు సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు. బ్యాక్ టూ బ్యాక్ హ్యాట్రిక్ హిట్లతో ఈ తరం హీరోలకు సవాల్ విసురుతున్న నాగ్ తో మరోసారి భక్తి ప్రయోగానికే మొగ్గుచూపి ఓనమో వెంకటేశాయ చిత్రాన్ని ప్రారంభించాడు.

నాగార్జున, హథీరాం బాబా పాత్రను పోషిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్ ఆయన సరసన నటిస్తోంది. అయితే తన చిత్రానికి కూడా ఈ సీనియర్ దర్శకుడు ఫస్ట్ లుక్ ట్రెండ్ నే ఫాలో అయిపోతున్నాడు. తాజాగా వెంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తున్న సౌరభ్ స్టిల్ రిలీజ్ చేసిన రాఘవేంద్రరావు తాజాగా అనుష్క ఫస్ట్ లుక్ రివీల్ చేశాడు. మహా భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క లుక్ నభూతో నభవిష్యత్ అన్న విధంగా ఉంది.

Anushka as Devotee

అరుంధతి, రుద్రమదేవి, దేవ సేన ఇలాంటి పాత్రల మాదిరిగానే అనుష్క కృష్ణమ్మగా కూడా ఫర్ ఫెక్ట్ గా సరిపోయింది. నటనపరంగా కూడా ఆమె నుంచి చాలానే అందించబోతున్నానని ఈ ఫస్ట్ లుక్ తో దర్శకేంద్రుడు చెప్పకనే చెప్పాడు. ప్రసుతం అన్నపూర్ణ సెవన్ ఎకర్స్‌లో చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుండగా, డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka Shetty  Krishnamma  Om Namo Venkateshaya  Nagarjuna  

Other Articles