మహేష్-మురగదాస్ సినిమాలో నమ్రతా నటించడం లేదు | No namrata in mahesh murugadoss movie

Namrata in mahesh movie just rumour

Namrata Shirodkar in Mahesh Babu movie, No namrata in mahesh murugadoss movie, Namrata role in mahesh movie, Mahesh babu wife re entry, no re entry for superstar wife

Namrata Shirodkar in Mahesh Babu Murugadoss movie just rumour.

సూపర్ స్టార్ వైఫ్ నటించడం లేదు

Posted: 08/03/2016 04:54 PM IST
Namrata in mahesh movie just rumour

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పిల్లలకు మంచి తల్లిగానే కాదు, భర్తకు సంబంధించి సినిమా వ్యవహారాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటుందనేది తెలిసిందే. రెమ్యునరేషన్, మహేష్ సొంత ప్రొడక్షన్ ఎంబీ కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను మొత్తం చూసుకునేది ఆమె. అంతేకాదు ప్రిన్స్ చేసే సోషల్ సర్వీస్ లోనూ ముందుంటుంది. నటిగా బిజీగా ఉన్న టైంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి ఇంటిపట్టున ఉంటుంది ఆమె.

అయితే చాలా గ్యాప్ తర్వాత మహేష్ మురగదాస్ చిత్రంతో నమ్రతా శిరోద్కర్ మేకప్ వేసుకోనుందనే వార్తలు గత కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ భార్యగా ఓ అతిథి పాత్రలో ఆమె నటించనుందని వాటి సారాంశం. ఠాగూర్ లో జ్యోతిక లాగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మహేష్ కు ఓ భార్య క్యారెక్టర్ ఉంటుందని, అది చనిపోయాకే మహేష్ న్యాయవ్యవస్థపై పోరాటం చేస్తాడని ఇలా ఎవరికి తోచినట్లు వారు కథనాలను ఊహించి రాసి పడేస్తున్నారు. మరి ఇంతకీ ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉంది.

నిజానికి ఆమెకు తిరిగి నటించాలన్న ఉద్దేశం అస్సలు లేదంట. భవిష్యత్తులో కూాడా ఆ అవకాశాలు తక్కువేనని చెబుతోంది. ఇప్పుడు మురగదాస్ సినిమా కోసం కూడా అసలు సంప్రదింపులే జరగలేదని, తాను నటిస్తున్నానని వస్తున్న వార్తలు ఉత్తవేనని ఆమె తేల్చిపడేసింది. ఈ మేరకు మహేష్ ఆఫీస్ కూడా ఈ వార్తలంతా గాసిప్పేనని కొట్టిపడేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  wife  namrata shirodhkar  murugadoss movie  gossip  

Other Articles