రాంగోపాల్ వర్మకు గ్యాంగ్ స్టర్ నోటీసులు | Gangster Yusuf Bachkan sent a legal notice to Ram Gopal Varma

Yusuf bachkan sent a legal notice to ram gopal varma

Gangster Yusuf Bachkan Varma, Varma Rai movie, Muthappa Rai movie, RGV Muthappa Rai, vivek Oberai as Muthappa Rai , gangster notice to varma, Muttappa Rai aid, legal notice to varma

Gangster Yusuf Bachkan sent a legal notice to ace filmmaker Ram Gopal Varma regarding the latter’s upcoming movie “Rai”.

జైలు నుంచే నోటీసులు పంపాడు

Posted: 08/04/2016 10:37 AM IST
Yusuf bachkan sent a legal notice to ram gopal varma

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ నిజ జీవిత గాథలను అధ్భుతంగా తెరకెక్కించడం, అవన్నీ హిట్లవ్వటం మనకు తెలిసిందే. రక్తచరిత్ర, కిల్లింగ్ వీరప్పన్, సర్కార్, ద అటాక్స్ ఆఫ్ 26/11 ఇవన్నీ అందుకు నిదర్శనాలు. మాములు చిత్రాలను ఎంత చెత్తగా తెరకెక్కిస్తాడో, రియల్ ఇన్సిండెట్ లను అంత ఇంటెన్సిటితో తీస్తుంటాడు.

ప్రస్తుతం వివేక్ ఒబేరాయ్ హీరోగా ఒకప్పటి బెంగళూరులో డాన్‌ ముత్తప్ప రై జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తీస్తున్నాడు. దశాబ్దం క్రితం డాన్ గా దేశానికి వణికించిన ముత్తప్ప రై ప్రస్తుతం ప్రస్తుతం జయ కర్ణాటక సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. హత్యకేసులతోపాటు అక్రమాయుధాల రవాణా ఆరోపణలపై ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో అతని బయోపిక్ గా ‘రై’ పేరుతో వర్మ తెరకెక్కిస్తున్నాడు. అయితే ముత్తప్ప రైకి గతంలో స్నేహితుడిగా ఉన్న యూసుఫ్ బచ్చాఖాన్ అనే మరో మాజీ గ్యాంగ్ స్టర్ తన పాత్ర పట్ల అభ్యంతరం చెబుతున్నాడు. ఈ మేరకు తన లాయర్ ద్వారా వర్మకి నోటీసులు పంపించారు.

'రై' సినిమాలో తన పాత్రను వర్మ పూర్తిగా నెగిటివ్ రోల్ (విలన్) గా చిత్రీకరిస్తున్నారని, కథ మొత్తం తనకు వినిపించిన తరువాతే సినిమా తీయాలని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. అలా కాకుండా సినిమా తీసేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి యూసుఫ్ బచ్చాఖాన్ భూ కబ్జాలు, బెదిరించి డబ్బు వసూలు చేయడం తదితర అభియోగాలతో కర్ణాటకలోని ధార్వాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విడుదలకు ముందే ఇలా వివాదాస్పదం కావటం ఊహించని ప్రచారం గా వర్మకు కలిసివచ్చేలా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Gangster  Muthappa Rai  movie  aid  Yusuf Bachkan  notice  

Other Articles