నిఖిల్ జాగ్వార్ తెలుగు టీజర్ విడుదల | Nikhil Kumar's Jaguar telugu teaser released

Nikhil kumar s jaguar telugu teaser released

Nikhil Kumar's Jaguar, jaguar telugu teaser, Jaguar own telugu dubbing

Nikhil Kumar's Jaguar telugu teaser released.

జాగ్వార్ మరో అఖిల్ కాదు కదా?

Posted: 08/01/2016 01:46 PM IST
Nikhil kumar s jaguar telugu teaser released

అక్కినేని వారసుడిగా ఆరంగ్రేటంతోనే దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించాడు అఖిల్. నాగేశ్వరావు లాంటి దేశం గర్వించదగ్గ నటుడి మనవడు కావటం, పైగా తండ్రి నాగ్ దగ్గరుండి మరీ చూసుకోవటంతో అమితాబ్ లాంటి దిగ్గజాలతోనేకాదు, సూర్య లాంటి క్రేజ్ ఉన్న హీరోలతో విషెష్ చెప్పించాడు. అంచనాలు అందుకోవటంలో విఫలం కావటంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం భారీగానే బోల్తాపడింది.

సరిగ్గా ఇప్పుడు అదే రేంజ్ లో మరో నటవారసుడు డెబ్యూ గురించి చర్చలు మొదలయ్యాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ ను హీరోగా పరిచయం చూస్తూ కన్నడలో జాగ్వార్ అనే చిత్రం రాబోతుంది. 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. ముందుగా ఈ చిత్రానికి కథ సమకూర్చింది సీనియర్ కథారచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, రెండోది దీనికి సంగీతం థమన్, మూడోది జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మనందం లాంటి స్టార్లు ఇందులో నటిస్తున్నారు.

అందుకే దర్శకుడు మహదేవ్ (గతంలో బాలయ్య మిత్రుడు సినిమాకి దర్శకత్వం వహించాడు) జాగ్వార్ ను తెలుగులోనూ రిలీజ్ చేయాలని ఆలోచన చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఆదివారం అట్టహసంగా రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. నిఖిల్ టీజర్లో సూపర్ హీరోలా వీర విన్యాసాలు చేశాడు. అంతేకాదు సొంతంగా తెలుగులోనూ డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎటోచ్చి డెబ్యూనే ఇంత భారీ యాక్షన్ తో రావటం అవసరమా అన్న ప్రశ్నలు లెవనెత్తుతున్నాయి. అఖిల్ చేసిన పొరపాటు నిఖిల్ చేస్తున్నాడన్న అని అంతా చర్చించుకుంటున్నారు. అయితే విజయేంద్రప్రసాద్ లాంటి రచయిత అందించిన కథ కావటంతో అనుమానాలు అస్సలు అక్కర్లేదని దర్శకుడు భరోసా ఇస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaguar  Nikhil Kumar  Telugu  own dubbing  

Other Articles

Today on Telugu Wishesh