టాలీవుడ్ సెన్సేషన్ ఈ తెలంగాణ కుర్రాడు | Vijay Devarakonda New Sensation in Tollywood

Vijay devarakonda new sensation in tollywood

Vijay Devarakonda New Sensation, New Sensation in Tollywood, Pellichoopulu hero Vijay Devarakonda, Vijay Devarakonda upcoming movies

Vijay Devarakonda New Sensation in Tollywood with Pellichoopulu success.

టాలీవుడ్ సెన్సేషన్ ఈ తెలంగాణ కుర్రాడు

Posted: 08/01/2016 04:30 PM IST
Vijay devarakonda new sensation in tollywood

బారెడు గడ్డంతో సుబ్బు... దూద్ కాశీ అంటూ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని పక్కన సందడి చేసిన విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఆ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు ఔరా అనిపించేలా ఉన్నాయి. కొత్తవాళ్లకు టాలీవుడ్ లో చోటుదక్కదనుకుంటున్న తరుణంలో చిత్రంలో మన ఇంట్లో తిరిగే కుర్రాడిలా నటించి ఆకట్టుకున్నాడు విజయ్. తొలి చిత్రం తర్వాత కొన్నాళ్లూ ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అతని చేతిలో ఇప్పుడు చెప్పుకోదగ్గ రెండు చిత్రాలు నిలుపుకున్నాడు.

కేవలం 80లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన పెళ్లి చూపులు దాదాపు 10 కోట్ల వసూళ్ల వైపు పరుగెడుతుందంటే దానికి కారణం విజయ్, అతని సింపుల్ నటనే. ఈ చిత్రంతో మరి కొంతకాలం తన స్థానాన్ని పదిలపరుచుకోవటంతోపాటు తాను ఇప్పుడు చేస్తున్న చిత్రాలపై అప్పుడే అంచనాలు పెరిగేలా చేసేసుకున్నాడు. అప్ కమింగ్ సినిమాలు అర్జున్ రెడ్డి, ద్వారకా రెండు నాలుగు బడ్జెట్ లోపు సినిమాలే. కానీ, పెళ్లి చూపులతో మనోడు సాధించిన సక్సెస్ తో మరో రెండు కోట్ల బడ్జెట్ పెంచేందుకు వారి సిద్ధంగా ఉన్నారంట.

సందేహం అక్కర్లేదు.. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఇప్పుడీ పేరు ఖచ్ఛితంగా సెన్సేషనే. భవిష్యత్తులో ఈ యంగ్ హీరో ద్వారా మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pellichoopulu  Vijay Devarakonda  Arjun Reddy  Dwaraka  

Other Articles