చిరు 150 టైటిల్ పై జోకులే జోకులు... | chiru 150 movie title troll on social media

Chiru 150 movie title troll on social media

Megastar chiranjeevi 150 movie, Chiru 150 movie title, new title for chiru, 150 movie title troll, chiru 150 troll on social media

చిరు 150 టైటిల్ పై జోకులే జోకులు... | chiru 150 movie title troll on social media

మెగా టైటిల్ పై జోకులే జోకులు...

Posted: 07/20/2016 04:54 PM IST
Chiru 150 movie title troll on social media

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కత్తిలాంటోడు కాదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త టైటిల్ ఆయన పుట్టినరోజున అనౌన్స్ చేస్తామని రాంచరణ్ ప్రకటించాడు. మొదటి నుంచి జనాల మైండ్ లో ఆ టైటిల్ ఫిక్స్ అయిపోవటంతో దాన్నే కంటిన్యూ చేసి ఉంటే బావుండేదని వినాయక్ సూచించినప్పటికీ మెగాస్టార్ అండ్ సన్ అందుకు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో దర్శకుడు కాస్త అలిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఏది ఏమైనా చిరు కొత్త సినిమా టైటిల్ ఏమయి ఉంటుందా అన్న డిస్కషన్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో దీనిపై మెగా అభిమానుల్లో చర్చ జరుగుతుండగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. అల్రెడీ కత్తి రీమేక్ కాబట్టి దీనికి కూడా కత్తి పెట్టాలని, అయితే గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా కత్తి పేరుతో ఓ సినిమా వచ్చి ఉండటంతో చిరు కత్తి అని పెట్టాలని పలువురు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత చిరు రాబోతున్నాడు కాబట్టి ఏదైనా క్యాచీ గా ఉండే చిత్రమైన టైటిల్ పెట్టాలని అంటున్నారు.

ఇంకొందరయితే ఇందులో చిరు ఎలాగూ ఖైదీ నంబర్ 150 డ్రసులో కనిపించాడు కాబట్టి సినిమాకు కూడా ఖైదీ నంబర్ 150 అనే టైటిల్ ఫిక్స్ అయితే బావుంటుందని సూచిస్తున్నారు. ఖైదీ సెంటిమెంట్ చిరుకు బాగా కలిసొచ్చిందని, గతంలో ఖైదీ, ఖైదీ నంబర్ 786 వచ్చి బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయని వివరణ కూడా ఇస్తున్నారు. మరికొందరు చిరు పాత సినిమా టైటిళ్లనే దులిపి పెట్టొచ్చుగా అని సలహాలు ఇస్తున్నారు. అయితే ఇవేం మెగా ఇమేజ్ కు సరిపోని టైటిళ్లని ఇట్టే అర్థమైపోతుంది. మెగా కాంపౌండ్ కి వ్యతిరేకంగా ఉండే ఓ వర్గం తిక్క తిక్క టైటిళ్లతో ఇలా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తుండగా, మెగా అభిమానులు వాటిపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  chiranjeevi  150 movie  title  Ram Charan  VV Vinayak  

Other Articles