జనతా గ్యారేజ్ సాంగ్ లీక్ పని ఎవరిది? | Janatha Garage Apple Beauty song leaked

Ntr s janatha garage apple beauty song leaked

NTR Janatha Garage, Janatha garage Apple Beauty song, Janatha garage leak song

NTR Janatha Garage Apple Beauty song leaked.

జనతా గ్యారేజ్ సాంగ్ లీక్ పని ఎవరిది?

Posted: 07/19/2016 04:41 PM IST
Ntr s janatha garage apple beauty song leaked

బడా సినిమాలకు లీకేజీల దెబ్బ పడటంలేదు. రజనీకాంత్ కబాలి సినిమా ఏకంగా సెన్సార్ బోర్డు దగ్గరి నుంచే లీకైందన్న వదంతులు సినీ వర్గాల్లో సంచలనంగా మారగా, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ పాట లీక్ కావటం చర్చనీయాంశంగా మారింది.

ఇంతకు ముందు షూటింగ్ క్లిప్పులను వీడియో తీసి అభిమానులు సరదాగా షేర్ చేయటం మనం చూశాం. కానీ, ఇప్పుడు ఆడియో రిలీజ్ అవ్వకుండానే అందులోని ఓ పాట నెట్ లో రిలీజ్ కావటం చిత్ర యూనిట్ లో కలకలం రేపుతోంది.  దివి నుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ... అంటూ సాగే ఈ పాటను చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ స్వయంగా ఆలపించడం విశేషం.  

పాట లీకేజీ గురించి తెలిసిన వెంటనే అప్రమత్తమై లింక్ ను తొలగించేందుకు యత్నించినప్పటికీ అప్పటికే అది అంతా వ్యాపించి పోయింది. ప్రస్తుతం ఈ లీక్ వీరుడు ఎవరో గుర్తించే పనిలో గ్యారేజ్ టీం ఉంది. మున్ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెబుతోంది. మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2 న విడుదల చేయాలని నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ఫ్లాన్ లో ఉంది. మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కీలకపాత్రలో నటిస్తుండగా, సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Devi sri prasad  Apple beauty song  leaked  

Other Articles

Today on Telugu Wishesh