ఏ ఫ్లైయింగ్ జెట్ ట్రైలర్ కామెడీ యాక్షన్ హీరో | Tiger Shroff A Flying Jatt trailer is filled with action and comic punches

A flying jatt trailer is filled with action and comic punches

Tiger Shroff A Flying Jatt, A Flying Jatt Comedy Trailer, A Flying Jatt trailer

Tiger Shroff A Flying Jatt trailer is filled with action and comic punches.

ట్రైలర్: ఫన్నీ సూపర్ హీరో ఫ్లైయింగ్ జెట్

Posted: 07/19/2016 02:59 PM IST
A flying jatt trailer is filled with action and comic punches

జాకీషాప్ర్ నటవారసుడిగా అడుగుపెట్టిన టైగర్ ష్రాఫ్ నటించిన రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద బాగానే ఆడాయి. ఈ ఊపులోనే తన మూడో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ‘ఏ ఫ్లైయింగ్ జెట్’ పేరుతో ఓ సూపర్ హీరోగా రాబోతున్నాడు. బాలాజీ మోషన్ పిక్చర్స్ లో ఏక్తాకపూర్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్ రెమో డిసౌజా దర్శకుడు. ఇక ఈ చిత్ర ట్రైలర్ నిన్న విడుదలైంది.

ఇక ట్రైలర్ ను గమనిస్తే.... హాలీవుడ్ లో తరచూ స్ఫూఫ్ సినిమాలు రావటం మనం చూస్తుంటాం. బాగా హిట్టయిన సినిమాలకు పేరడీలుగా తీసే అవి కూడా ఓ వర్గం ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారు. ఇక ఫ్లైయింగ్ జెట్ విషయానికొస్తే ఇది కూడా ఓ స్ఫూఫ్ సినిమాగానే భావించవచ్చు. అతీతశక్తులు ఉన్న ఓ కుర్రాడు ఫ్లైయింగ్ జెట్ అవతారం ఎత్తి ఆపదలో ఉన్నవారిని రక్షించేందుకు యత్నిస్తూ తానే చిక్కుల్లో పడుతుంటాడు. పూర్తిస్థాయి యాక్షన్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కామెడీపాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంతలో అనుకోని ట్విస్ట్.

మంచి ఉన్న చోటే చెడు ఉంటుంది అన్నట్లు సూపర్ హీరో ఉన్నట్లే ఓ బ్యాడ్ మేన్ కూడా వస్తాడు. ఆపై పోరాటంలో ఫ్లైయింగ్ జెట్ చిత్తు చిత్తు కావటం, మరో అతీత శక్తితో తిరిగి కోలుకోవటం, ఆ దుష్టశక్తితో పోరాడి ఓడించేయటం ఊహించిన కాన్సెప్ట్ ఇందులో చూపాడు. పనిలో పనిగా హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో కూడా రొమాన్స్ బాగా పెట్టాడు. లిప్ కిస్సులు, పంజాబ్ పాటలకు మోడ్రన్ టచ్ ఇచ్చి రీమిక్స్ చేయటం, వాటికి టైగర్ షాఫ్ర్ ఇరగదీసే డాన్సులు మొత్తానికి ట్రైలర్ బాగానే ఉంది. సాధారణంగా సూపర్ మెన్ తరహాలో వచ్చిన సినిమాల్లో ఒక్క క్రిష్ తప్ప ఏవీ పెద్దగా ఆడలేదు. మరి ఈ ఫ్లైయింగ్ జెట్ ఏ మేర అలరిస్తాడో తెలియాలంటే ఆగష్టు 25 వరకు ఆగాల్సిందే.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiger Shroff  A Flying Jatt  trailer  Remo D'Souza  Jacqueline Fernandez  

Other Articles