బోయపాటి ఇచ్చే ట్విస్ట్ అలా ఉంటుంది | Boyapati about his movies climax

Boyapati about his movies climax

Director Boyapati about his movies, Director Boyapati Climax twist, Director Boyapati bellamkonda srinivas, Director Boyapati about alludu bangaram

Director Boyapati about his movies climax.

బోయపాటి ఇచ్చే ట్విస్ట్ అలా ఉంటుంది

Posted: 07/15/2016 02:00 PM IST
Boyapati about his movies climax

కథలో ఏ మాత్రం హడావుడి లేకుండా ఎలాంటి హీరో అయిన మాస్ ఇజాన్ని బయటికి లాగగలిగే ఒకే ఒక డైరక్టర్ బోయపాటి. ఎక్కువ ఫాక్షన్ నేపథ్యం ఉన్న కథలకు ప్రయారిటీ ఇచ్చే ఈ టాప్ డైరక్టర్ కథల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు. బాలకృష్ణ లాంటి సీనియర్ హీరో కూడా ఈయన చెప్పిన విషయాలకు అడ్డుచెప్పకుండా ఫాలో అయిపోతుంటాడంట. అందుకే రెండు బ్లాక్ బస్టర్లను అందించగలిగాడు.

ఇక కథల విషయంలో ఆయన ఫాలో అయిపోయే సిద్ధాంతాలను ఆయన మీడియాతో షేర్ చేసుకున్నాడు. కథల విషయంలో పెద్ద హడావుడి చేయను, సింపుల్ గా ఓ స్టోరీ లైన్ అనుకుని దాన్నే డెవలప్ చేసుకుంటూ పోతాను. ముఖ్యంగా నెక్స్ట్ సీన్ ఏంటనేది ప్రస్తుతం జరుగుతున్న సీన్ మీదే ఆధారపడి ఉంటుంది తప్ప, ముందే రాసి పెట్టుకోవటం నాకు అలవాటు లేదు అని చెబుతున్నాడు. ఇక మిగతా దర్శకుల్లా క్లైమాక్స్ ను ముందే రాసి పెట్టుకోవటం అంటే నాకు చిరాకు, సినిమాలో మధ్యలో ఉండగానే ఆ విషయంలో నేను ఓ అభిప్రాయానికి వస్తాను. తద్వారానే ఎలాంటి క్లైమాక్స్ ఉండాలో ఫ్లాన్ చేసుకుని అప్పుడు ప్రోసీడ్ అవుతాను అంటున్నాడు.

అంటే అల్రెడీ చిత్రీకరించిన సన్నివేశాలను ఒక లుక్కేసుకుని ఆ అవుట్ ఫుట్ ను బట్టి క్లైమాక్స్ మోతాదు ఎంత ఉండాలనేది డిసైడ్ చేసుకుంటాడంట. మొదటి నుంచి కూడా ఈ విధంగా చేయడమే తనకి అలవాటనీ, ఇదే తన సక్సెస్ సీక్రెట్ అని ఆయన చెబుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమాను తెరకెక్కించేపనిలో బిజీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  director  Boyapati Srinu  Bellamkonda Srinivas  Climax  

Other Articles

Today on Telugu Wishesh