జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ వాయిదా | NTR Janatha Garage Release Date Postponed

Ntr janatha garage release date postponed

Janatha Garage Release Date , Janatha Garage Release Date postponed, Janatha Garage Release Date change

NTR Janatha Garage Release Date Postponed.

జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ వాయిదా

Posted: 07/15/2016 10:58 AM IST
Ntr janatha garage release date postponed

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి చేదు వార్త. ఎట్జి పరిస్థితుల్లో అనుకున్న తేదీకి జనతా గ్యారేజ్ సినిమా చేస్తామన్న చిత్ర యూనిట్ మాట తప్పింది. శుక్రవారం ఉదయం మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రకటన చేశారు. ఇంకా రెండు పాటలతోపాటు కాస్త టాకీ పార్ట్ షూటింగ్ మిగిలి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.

తప్పనిసరి పరిస్థితులు.. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. అయితే వాయిదా పడ్డం తమకేమీ బాధ లేదని.. తాము అనుకున్న దానికంటే ఔట్ పుట్ గొప్పగా వచ్చిందని వారు చెబుతున్నారు. హఠాత్తుగా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో.. అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇక రిలీజ్ తేదీ ప్రకటించనప్పటికీ సెప్టెంబర్ 2న విడుదల చేసే యోచనలో నిర్మాతలు ఉన్నారంట.

దర్శకుడు కొరటాల, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ తోపాటు మోహన్ లాల్ లాంటి స్టార్ టీం కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. గ్యారేజ్ చిత్రం పోన్ తో వెంకీ బాబు బంగారం ఆ రోజునే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Release Date  

Other Articles