అకీరాకు అన్నీ కష్టాలే | sonakshi sinha real stunts and injured for Akira

Sonakshi sinha real stunts and injured for akira

No doop for Sonakshi in Akira, Murugadoss Akira Movie, Sonakshi Akira Movie

sonakshi sinha real stunts for Akira. Sonakshi posted injured photo while in Akira shooting.

అకీరాకు అన్నీ కష్టాలే

Posted: 07/14/2016 05:30 PM IST
Sonakshi sinha real stunts and injured for akira

ముక్కుపుడక సోయగం సోనాక్షి సిన్హా తన విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే అస్సలు ఊరుకోదు. ముఖ్యంగా సినిమాల విషయంలో... డూప్ లు లేకుండానే కానిచ్చేస్తుంటుంది. అయితే ఇప్పటి మెతక వేషాలేసిన ఈ అమ్మడికి అకీరాలో కాస్త టఫ్ రోల్ పడింది. యాక్షన్ సన్నివేషాల్లో నటించాల్సి వచ్చింది. అయితే దర్శకుడు మురగదాస్ వారించినప్పటికీ వినకుండా తానే స్వయంగా ఫైట్లు చేసిందట... మరి ఏమైంది....

ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్న ఫోటో అదే. ఫర్ ఫెక్ట్ మార్సల్ ఆర్ట్స్ శిక్షకులు చేయాల్సిన స్టంట్ ను తానే స్వయంగా చేసి ఇలా దెబ్బలు తాకించుకుంది. అయితేనేం సీన్ సరిగ్గా పండిందట. దీంతో ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రైడ్ మూమెంట్ అంటూ సందేశాన్ని కింద ఉంచింది.


ఇక ఈ దెబ్బలు మానేందుకు మంచి స్నేహితుడు, యాక్షన్ హీరో అయిన అక్షయ్ కుమార్ సాయం తీసుకుంటుందట. తమిళ హిట్ మూవీ మౌనగురు(2014) రీమేక్ గా వస్తున్న అకీరా సెప్టెంబర్ 2 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇందులో ఆడాళ్ల పై అకృత్యాలు చేసే దుండగుల పని పట్టే జర్నలిస్ట్ గా సోనాక్షి కనిపించబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonakshi sinha  Akira  Murugadoss  real stunts  

Other Articles

Today on Telugu Wishesh