వైజాగ్ రోడ్లను వణికిస్తున్న సింగం | suriya busy with Singam-3 in vizag

Suriya flies to malaysia for singham 3

suriya singham 3, singham 3 in Malaysia, singham in Malasiya

After Rajani for Kabali suriya flies to Malaysia for singham 3

కబాలి స్పాట్ లో సూర్య

Posted: 07/14/2016 05:51 PM IST
Suriya flies to malaysia for singham 3

సూర్య సూపర్ హిట్ సీక్వెల్ సింగం-3 ప్రస్తుతం వైజాగ్ లో నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సాధ్యమైనంత త్వరగా 'సింగం 3' సినిమా షూటింగును పూర్తిచేసే దసరా కల్లా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధపడుతున్నాడు. ప్రస్తుతం సూర్య .. శ్రుతిహాసన్ కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తున్నారు.

ఇంకో రెండు రోజులపాటు వైజాగ్ రోడ్లపై సింగం తిరుగుతూనే ఉంటుందట. ఆపై ఈ నెల 18 నుంచి చెన్నైలో తాజా షెడ్యూల్ మొదలుకానుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి, చివరి షెడ్యూల్ ను మలేసియాలో ప్లాన్ చేశారు. ఆగస్టు 5 నుంచి మొదలయ్యే షెడ్యూల్ని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో షూట్ చేయనున్నారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి ఎక్కడైతే షూటింగ్ జరుపుకుందో అదే లోకేషన్లలో సింగం ను తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఇక గత కొద్దిరోజులుగా చిత్ర టైటిల్ మారబోతుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో సూర్య భార్యగా అనుష్క నటిస్తుండగా, శ్రుతిహాసన్ జర్నలిస్టుగా కనిపించనుంది. హ్యారిస్ జైరాజ్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suriya  Malaysia  Singham 3  Shruthi hassan  Anushka  

Other Articles