100 days of love movie audio launch guest hero nani and nithin

100 days of love movie audio launch guest hero nani and nithin

nithya menon movie, 100days of love movie, nithya menon upcoming movies, nithya menon movie, nithya menon and dalquer salman, nani, nithin

hero nani and nithin launching the audio of nithya menon movie 100days of love. this movie is creating sunseational hit in malayalam

ఆడియోలో హిట్ జంట..!

Posted: 07/12/2016 11:26 AM IST
100 days of love movie audio launch guest hero nani and nithin

టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో బిజీగా ఉన్న నాని, నితిన్ లు 100 డేస్ లవ్ లో పడనున్నారు. అర్ధం కాలేదా, నిత్యామీనన్ , మమ్ముట్టి తనయుడు నటించిన 100 డేస్ లవ్ సినిమా ఈ నెల 13వ తేదిన ఆడియో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియోకి ఈ యంగ్ హీరోలు ముఖ్య అతిథులుగా రానున్నారు. విషయం ఏంటంటే, ఈ ఇద్దరి హీరోలకు నిత్యామీనన్ మంచి క్లోజ్ ఫ్రెండ్ కావడం, మంచి కో స్టార్ కావడం వల్ల ఇప్పుడు ఈ సినిమా ఆడియో విడుదలకు గెస్ట్ లు గా వెళ్లనున్నారు.

ఇప్పటికే దుల్కర్ స‌ల్మాన్, నిత్య మీన‌న్ లు క‌లిసి న‌టించిన సినిమాల‌న్నీ ఎంతో మంచి స‌క్సెస్ ను ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌ళ్లీ వీరిద్దరూ క‌లిసి న‌టిస్తున్న '100 డేస్ ఆఫ్ ల‌వ్' సినిమా వీటన్నింటినీ మ‌రిపించేది గా తెర‌కెక్కించారు ద‌ర్శక నిర్మాత‌లు . జీన‌స్ ముహ్మద్ ద‌ర్శక‌త్వంలో, SSC మూవీస్ స‌మ‌ర్పణ‌లో , ఎస్. వెంక‌ట‌ర‌త్నం నిర్మాత‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మ‌ల‌యాళం లో ఎంతటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను హైద‌రాబాద్ లో ఈనెల 13న విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఓకే బంగారంతో యూత్ ని క‌ట్టిప‌డేసిన ఈ జంట‌, ఈ సినిమాతో అంద‌రికీ మరింత చేరువ కానున్నారు. మంచి రొమాంటిక్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను జులై నెలాఖ‌రుకి విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కొసమెరుపు ఏంటంటే, మలయాళం యంగ్ హీరో దల్కర్ సల్మాన్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉండటం , అలాగే నిత్యామీనన్ ఈ సినిమాలో మంచి గ్లామరస్ గా ఉండటం అనేది సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్తున్నారు అందరూ.
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress nithya menon  hero nani  nithin  dalquar salman  malayalam 100days of love  

Other Articles