ramcharan teja doing new projects in this year

Ramcharan teja doing new projects in this year

ramcharan teja with pets, ram charan dogs, ram charan pets, ram charan movies, ram charan next movies, ram charan upcoming movies, ram charan next movies, ram charan teja, chiranjeevi son, south mega power star ram charan, ram charan krishna vamsy, ram charan and sukumar

hero ram charan teja doing many movies in this year. now he is decided to do more films for his fans. and meanwhile he is spending time with his pets.

చెర్రీ పెట్ అదిరింది..!!

Posted: 07/12/2016 12:20 PM IST
Ramcharan teja doing new projects in this year

కాశ్మీర్ లో షూటింగ్ చేసి వచ్చిన దగ్గర్నుంచి రామ్ చరణ్ తేజ్ తన పెట్స్ ని వదలట్లేదు. వాటితోనే కాలక్షేపం చేస్తున్నాడు. షూటింగ్ గ్యాప్స్ ఉన్నప్పుడు కూడ పెట్స్ తోనే తిరుగుతున్నాడు చెర్రీ బాబు. తనకి అత్యంత ఇష్టమైన బేబీ డాగ్స్ ఫోటోలను సోషల్ సైట్స్ లో అప్ లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్ కి వాటిని పరిచయం చేస్తున్నాడు రామ్ చరణ్.
ఇప్పుడు ఈ ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే చెర్రీ యమా స్పీడ్ గా సినిమాలను చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ద్రువ సినిమా సెట్స్ పైన ఉండగానే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చెర్రీ. డైరెక్టర్ సుకుమార్ తో ఒక వైవిధ్యభరితమైన ప్రొజెక్ట్ ని ఓకే చేసినట్లు చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు.

అంతేకాదు, తర్వాత చెర్రీ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కూడ ఈ సంవత్సరమే ముహూర్తం పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. షూటింగ్ టైమ్ లో బోయపాటి శ్రీనివాస్ చెప్పిన కథని కూడ రామ్ చరమ్ విన్నట్లుగా, ఆ సినిమా కూడ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు చరణ్ సన్నిహిత వర్గాలు.

బ్రూస్ లీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చెర్రీ ఇక తగ్గే ప్రసక్తే లేదంటూ సినిమాలన్నింటినీ లైన్లో పెడుతుండటంతో మెగా అభిమానులు ఆనందంగా ఉన్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan teja movies  ram charan upcoming movies  ram charan druva  druva movie  

Other Articles