పెళ్లి చూపులు ప్రెషేనా? | Pelli Choopulu telugu movie official trailer released

Pelli choopulu telugu movie official trailer released

pelli choopulu official trailer, vijay devarakonda and ritu varma, tatrun bhaskar pelli choopulu

Pelli Choopulu telugu movie official trailer released. Vijay Devarakonda, and Ritu Varma Under tarun bhaskar Direction.

పెళ్లి చూపులు ప్రెషేనా?

Posted: 07/04/2016 11:29 AM IST
Pelli choopulu telugu movie official trailer released

ఈ మధ్య సినిమాలకు షార్ట్ ఫిల్మ్స్ కు పెద్ద తేడా లేకుండా పోతుంది. భారీ బడ్జెట్ పెట్టుకోలేని నిర్మాతలు చిన్న సినిమాలను ఏ హడావుడి లేకుండా ముగించేస్తున్నారు. అదే టైంలో స్టార్లచేత ఫ్రీ ప్రమోషన్ చేయించుకుంటూ బోల్డెంత ఆసక్తిని రెకెత్తిస్తున్నారు. అలా రాబోతున్న మరో చిత్రం పెళ్లి చూపులు.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ రిషిగా అలరించిన గడ్డం కుర్రాడు విజయ్ దేవరకొండ హీరోగా,  రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘పెళ్లి చూపులు’. థర్మపథ క్రియేషన్ బ్యానర్ లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. అల్రెడీ మోషన్ పిక్చర్ ను హీరో నాని చేత రిలీజ్ చేయించిన సంగతి తెలిసిందే.

ఇక ట్రైలర్ ను గమనిస్తే... చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా కాన్సెప్టు కూడా చాలా కొత్తగా ఉంది. పెళ్లి చూపులకు వెళ్లిన కుర్రాడు తన కష్టాలను ఆ అమ్మాయితో ఏకరువు పెట్టడం, తనమో బాయ్ ఫ్రెండ్.. బ్రేకప్ స్టోరీ గురించి చెప్పటం, చివరకు పెళ్లి ఇష్టం లేదని షాకిచ్చి చివరికి వాళ్లిద్దరూ కలిసి పుడ్ సెంటర్ నిర్వహించడం మరీ చివరకు ఏమౌతుంది అన్నదే కథాంశంగా తెలుస్తుంది... చూస్తుంటే లో బడ్జెట్ తో మరో ఇంటస్ట్రింగ్ సినిమా తెలుగులో రాబోతుందని అర్థమౌతుంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pelli choopulu  vijay devarakonda  ritu varma  tatrun bhaskar  

Other Articles

Today on Telugu Wishesh