ఆడిషన్ లో స్టార్ నటిపై లైంగిక దాడి | thandie newton sexually harassed during audition

Thandie newton sexually harassed during audition

Hollywood actress Thandie Newton, Thandie Newton sexually harassed, tom cruise heroine sexually harassed

Hollywood actress Thandie Newton sexually harassed during audition by director.

ఆడిషన్ పేరుతో స్టార్ నటిపై లైంగిక దాడి

Posted: 07/04/2016 03:18 PM IST
Thandie newton sexually harassed during audition

సినిమా ప్రపంచంలో నటీమణులను సెక్స్ బొమ్మలుగా వాడుకోవటం కేవలం చిన్న హీరోయిన్లకే పరిమితం కాలేదు. ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. కెరీర్ ప్రారంభంలో ఓ చిత్ర అడిషన్ కోసం వెళ్లిన తనను దర్శకుడు లైంగికంగా వేధించాడంట. ఆమె ఎవరో కాదు ప్రస్తుతం హాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న థాండే న్యూటన్.

ట్రామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్-2, క్రాష్ వంటి ప్రముఖ చిత్రాల్లో ఆమె లీడింగ్ హీరోయిన్. తన మెస్మరైజింగ్ నటనతో కెరీర్ లో కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చీకటి కోణాన్ని వివరించింది.  

కెరీర్ ప్రారంభంలో ఓ చిత్ర ఆడియో కోసం వెళ్లాను. అక్కడే ఓ లేడీ డైరక్టర్ తోపాటు ఇంకో దర్శకుడు ఉన్నాడు. ఆయన నన్ను పోర్న్ నటిలా యాక్ట్ చేయమని కోరాడు. నా వద్దకు వచ్చి బలవంతంగా బట్టలు తీసేశాడు. నా మర్మాంగాలను పట్టుకుని ఎక్స్ ప్రెషన్ లు ఇవ్వమంటూ నాపై లైంగికంగా వేధింపులకు దిగాడు. ఆ మహిళ దర్శకులు బొమ్మలా చూస్తుందే తప్ప అతన్ని ఆపేందుకు ప్రయత్నం చేయలేదు. ఆపై నన్ను ఇష్టం వచ్చినట్లు పట్టుకుని చేతులు వేయసాగాడు. అది గుర్తోచ్చినప్పుడల్లా నాకు చాలా బాధవేస్తుంది.

అవకాశాల కోసం అప్పుడు అన్నింటిని భరించాల్సి వచ్చింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.  అయితే తనలా మరెవ్వరికీ ఇలాంటి చేదు అనుభవాలకు గురికావొద్దని, అవకాశాల కోసం టాలెంట్ ను నమ్ముకోవాలే తప్ప తనలా ఒళ్లును కాదని చెబుతోంది థాండే.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hollywood  top actress  Thandie Newton  sexually harassed  audition  

Other Articles