సైమా అవార్డుల-2016 పూర్తి జాబితా | complete award winners list of SIIMA 2016 for telugu

Complete award winners list of siima 2016 for telugu

SIIMA awards 2016, SIIMA awards 2016 tollywood, SIIMA awards 2016 baahubali, SIIMA awards 2016 srimanthusu, SIIMA awards 2016 tollywood

SIIMA awards 2016 that is being held at Singapore this year. complete award winners list of SIIMA 2016 for telugu.

సైమా అవార్డుల-2016 పూర్తి జాబితా

Posted: 07/01/2016 11:35 AM IST
Complete award winners list of siima 2016 for telugu

సౌత్ సినిమాల అవార్డు పండగ సైమా సింగపూర్ లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజుకు గానూ టాలీవుడ్(తెలుగు), శాండల్ వుడ్(కన్నడ) చిత్రాలకు సంబంధించి  అవార్డులను ప్రకటించారు. అంతా ఊహించినట్లుగానే బాహుబలి, శ్రీమంతుడు అవార్డులను కొల్లగొట్టాయి. రెండు చిత్రాలు చెరో 6 అవార్డులు దక్కించుకున్నాయి. మహేష్ బాబు శ్రీమంతుడుగా ఉత్తమ హీరో అవార్డు గెల్చుకుంటే, జక్కన్న కళాఖండం బాహుబలి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ హీరోయిన్ గా శృతీహాసన్ (శ్రీమంతుడు) ఎగరేసుకుపోయింది. ఇక క్రిటిక్స్ విభాగంలో అల్లు అర్జున్, అనుష్క శెట్టిలకు రుద్రమదేవీకి గానూ అవార్డులు దక్కాయి. సౌత్ బ్యూటీ సమంతకు యూత్ ఐకాన్ ఫర్ సౌత్ అవార్డు దక్కింది. కన్నడలో సస్పెన్స్ థ్రిల్లర్ మైత్రి ఉత్తమ చిత్రంగా, పునీత్ రాజ్ కుమార్ (రానా విక్రమ చిత్రం) ఉత్తమ నటుడు, రచితా రామ్ (రన్నా చిత్రం-అత్తారింటికి దారేది రీమేక్) ఉత్తమ హీరోయిన్ గా, ఉప్పీ-2 చిత్రానికి గానూ నటుడు ఉపేంద్ర ఉత్తమ దర్శకుడు అవార్డులు దక్కించుకున్నారు.


ఉత్తమ చిత్రం: బాహుబలి

ఉత్తమ నటుడు మహేష్ బాబు(శ్రీమంతుడు)

ఉత్తమ: నటి శృతీ హాసన్ (శ్రీమంతుడు)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్):  అల్లు అర్జున్(రుద్రమదేవీ)

ఉత్తమ నటి (క్రిటిక్స్) :   అనుష్క శెట్టి(రుద్రమదేవీ)

ఉత్తమ దర్శకుడు :  రాజమౌళి(బాహుబలి)

ది యూత్ ఐకాన్ ఫర్ సౌత్ ఇండియా: సమంత

ఉత్తమ సహనటుడు: రాజేంద్ర ప్రసాద్ (శ్రీమంతుడు)

ఉత్తమ సహనటి:   రమ్యకృష్ణ(బాహుబలి)

ఉత్తమ విలన్:   రానా దగ్గుబాటి(బాహుబలి)

ఉత్తమ కమెడియన్ :  వెన్నెల కిషోర్ (భలే భలే మగాడివోయ్)

ది లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు:  ప్రముఖ గాయని ఎస్.జానకీ

సౌత్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు : సుధీర్ బాబు

ఉత్తమ డెబ్యూ నటుడు : అఖిల్ అక్కినేని(అఖిల్)

ఉత్తమ డెబ్యూ నటి : ప్రగ్యా జైస్వాల్ (కంచె)

ఉత్తమ డెబ్యూ నిర్మాత : విజయ్ రెడ్డి మరియు శశిదేవ్ రెడ్డి (భలే మంచి రోజు)

ఉత్తమ డెబ్యూ దర్శకుడు : అనిల్ రావిపూడి(పటాస్)

పాపులర్ సాంగ్ అవార్డు : దేవీ శ్రీ ప్రసాద్ (శ్రీమంతుడులోని రామ రామ... సాంగ్)

ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)

ఉత్తమ కొరియోగ్రాఫర్ : జానీ మాస్టర్ (టెంపర్ టైటిల్ సాంగ్)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సెంథిల్ (బాహుబలి)

ఉత్తమ రచయిత  : సిరివెన్నెల సీతారామ శాస్త్రి (కంచె)

ఉత్తమ గాయకుడు : సాగర్(శ్రీమంతుడులోని జతకలిసే... పాటకు)

ఉత్తమ గాయని : సత్యా యామిని(బాహుబలిలోని మమతల తల్లి... పాటకు)

రెండో రోజు కోలీవుడ్, మాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించి విభాగాలకు అవార్డులను అందజేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SIIMA awards 2016  singapore  tollywood  baahubali in SIIMA  srimanthudu in SIIMA  

Other Articles