నటుడి కూతురితో విశాల్ క్లోజ్ ఫోటో | vishal posted close pic with Varalakshmi Sarathkumar

Vishal posted close pic with varalakshmi sarathkumar

hero vishal twitter, vishal tweet Varalakshmi Sarathkumar, vishal Varalakshmi Sarathkumar close pic, vishal close pic with star hero daughter, vishal posted close pic with Varalakshmi, వరలక్ష్మీతో ఫోటో షేర్ చేసిన విశాల్, స్టార్ హీరో కూతురితో విశాల్ క్లోజ్ ఫోటో, విశాల్ క్లోజ్ ఫోటో, విశాల్ ట్విట్టర్, విశాల్ శరత్ కుమార్ కూతురు, movie news, kollywood news, sharath kumar daughter close with vishal, star daughter pic with vishal

vishal posted close pic with Varalakshmi Sarathkumar. And hinted he was still in love with her.

నటుడి కూతురితో హీరో మరీ ఇంత క్లోజా?

Posted: 06/28/2016 05:36 PM IST
Vishal posted close pic with varalakshmi sarathkumar

తెలుగు వాడయిన విశాల్ రెడ్డి అలియాస్ విశాల్ కోలీవుడ్ సినిమాల్లో ఇరగదీయడమే కాదు, తమిళ సినిమాలను శాసించే నడిగర్ సంఘంకు జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన గెలుపు సాధించాడు. సీనియర్ నటుడు శరత్ కుమార్ పై తొడ గొట్టి మరీ జయకేతనం ఎగరవేశాడు. అంతేకాదు ఆయన ముద్దుల కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ తో కొన్నాళ్లూ ప్రేమాయణం కూడా సాగించాడు. కానీ, ఎన్నికల హడావుడితో బిజీ అయిన విశాల్ ఆ తర్వాత ఆమెకు దూరంగా ఉన్నాడు. అయితే అది ఇక శాశ్వతంగా... అంటూ మీడియా కోడై కూసింది.

తండ్రి పరాభవంతో విశాల్ పై ఆమె కోపం పెంచుకుందనీ, వీరిద్దరు విడిపోయారని వార్తలు కూడా రాసేశాయి. ఇదిలా ఉండగానే నడిగర్ సంఘం భవనం పూర్తయిన తర్వాతే పెళ్లని ప్రకటించిన విశాల్ అది ఎవరితో అనేది మాత్రం ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఏమో అది వరలక్ష్మీతో కూడా కావొచ్చంటూ చతురులు పేల్చాడు. కానీ, అది జోక్ కాదని తాజాగా కన్ఫర్ఫ్ చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు.

‘‘ఈ ఒక్క ఫోటో అంతా చెప్పేస్తుంది’’ అంటూ ఈ నల్లనయ్యా తన మనసులోని ప్రేమను ఓ సందేశ రూపంలో ఫోటోకి జత చేశాడు. దీంతో విశాల్, వరలక్ష్మీలు విడిపోలేదనే వార్త ఒక్క ఫోటోతో కన్ఫర్మ్ చేసేశాడు. ఎటోచ్చి పెళ్లి ఈమెతోనే అన్న ఒక్క ముక్క తేల్చేస్తే అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు కదా.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles